రేపటి నుంచి శాంసంగ్ గెలాక్సీ ‘ఎం01 కోర్’ సేల్
దిశ, వెబ్‌డెస్క్: శాంసంగ్ తన నూతన బడ్జెట్ ఫోన్‌ను జులై 27న మార్కెట్‌లో విడుదల చేసింది. ‘గెలాక్సీ ఎం01 కోర్’ పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్.. బుధవారం (జులై 29) నుంచి ఈ కామర్స్ స్టోర్లతో పాటు శాంసంగ్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ లభ్యం కానుంది. ఆండ్రాయిడ్ గో ఓఎస్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో మార్కెట్‌లోకి రాబోతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న.. రియల్ మీ సీ2 (రూ. 6499/-), మోటో జీ5 […]
దిశ, వెబ్‌డెస్క్: శాంసంగ్ తన నూతన బడ్జెట్ ఫోన్‌ను జులై 27న మార్కెట్‌లో విడుదల చేసింది. ‘గెలాక్సీ ఎం01 కోర్’ పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్.. బుధవారం (జులై 29) నుంచి ఈ కామర్స్ స్టోర్లతో పాటు శాంసంగ్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ లభ్యం కానుంది. ఆండ్రాయిడ్ గో ఓఎస్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో మార్కెట్‌లోకి రాబోతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న.. రియల్ మీ సీ2 (రూ. 6499/-), మోటో జీ5 ప్లస్ (రూ. 5099/-), రెడ్ మీ నోట్ 4 (రూ. 5299/-) ఫోన్లకు పోటీగా నిలవనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం01 కోర్ 1జీబీ/ 16జీబీ వేరియంట్ ధర రూ.5,499/- కాగా, 2జీబీ/ 32జీబీ వేరియంట్ ధరను రూ.6,499గా నిర్ణయించింది. ఇందులో డ్యూయల్ సిమ్ ఆప్షన్ తోపాటు 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ సదుపాయం కూడా ఉంది.
గెలాక్సీ ఎం01 కోర్ ఫీచర్స్ :
డిస్ ప్లే : 5.30 ఇంచులు
ప్రాసెసర్ : మీడియాటెక్ ఎంటీ 6739
ర్యామ్ : 1జీబీ / 2 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్ : 16జీబీ/32జీబీ
రేర్ కెమెరా : 8ఎంపీ
ఫ్రంట్ కెమెరా : 5 ఎంపీ
ఓఎస్ : ఆండ్రాయిడ్ గో ఎడిషన్
బ్యాటరీ : 3,000 ఎంఏహెచ్
రంగులు : నలుపు, నీలం, ఎరుపు