‘కాలా’ అని పిలిచారు.. కోపం వచ్చింది’
దిశ, స్పోర్ట్స్: తానూ వర్ణ వివక్ష బాధితుడినేననీ, అది కూడా ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్’ (ఐపీఎల్)లోనే ఈ వివక్ష ఎదుర్కొన్నానంటూ వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ డారెన్ సామి సంచలన వ్యాఖ్యలు చేశాడు. జార్జ్ ఫ్లాయిడ్ మృతితో అమెరికాలో ‘ఐ కాంట్ బ్రీత్’ పేరుతో వర్ణ వివక్షపై మొదలైన ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలువురు క్రికెటర్లు స్పందించగా, తాజాగా, డారెన్ సామి నోరు విప్పాడు. ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్ […]
దిశ, స్పోర్ట్స్: తానూ వర్ణ వివక్ష బాధితుడినేననీ, అది కూడా ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్’ (ఐపీఎల్)లోనే ఈ వివక్ష ఎదుర్కొన్నానంటూ వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ డారెన్ సామి సంచలన వ్యాఖ్యలు చేశాడు. జార్జ్ ఫ్లాయిడ్ మృతితో అమెరికాలో ‘ఐ కాంట్ బ్రీత్’ పేరుతో వర్ణ వివక్షపై మొదలైన ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలువురు క్రికెటర్లు స్పందించగా, తాజాగా, డారెన్ సామి నోరు విప్పాడు. ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన సమయంలో శ్రీలంక క్రికెటర్ తిసారా పెరిరాను, తనతో కలిపి భారత అభిమానులు తమ శరీర రంగును ప్రస్తావిస్తూ అవహేళన చేశారని గుర్తు చేసుకున్నాడు. తమ ఇద్దరినీ అభిమానులు ‘కాలా’ అని పిలిచేవారనీ, తొలుత దాని అర్థం తెలియక పట్టించుకోలేదన్నాడు. అయితే, హిందీలో నల్లగా ఉన్నవారిని కాలూ అని పిలుస్తారని తెలుసుకొని తీవ్ర ఆగ్రహానికి గురయ్యానన్నాడు. జాతి వివక్షకు వ్యతిరేకంగా గళం విప్పాలని ఐసీసీ, ఇతర క్రికెట్ బోర్డులకు డారెన్ ఇప్పటికే విజ్ఞప్తి చేశాడు.