దాతృత్వం చాటుకున్నసాంబశివరెడ్డి..
దిశ, మణుగూరు: సమాజంలో వికలాంగులను ఆదరించి, గౌరవించాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం టీ కొత్తగూడెంలోని సాధనపళ్లి అచ్చయ్య అనే నిరుపేద వికలాంగుడిని ఆదుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అచ్చయ్య అనే వ్యక్తికి కిడ్నీలు చెడిపోవడంతో రెండు కాళ్లు పని చేయకుండా పూర్తిగా వికలాంగుడిగా మారిపోయాడన్నారు. అచ్చయ్య కు వికాస్ అగ్రి ఫౌండేషన్ నుండి ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఖరీదైన […]
దిశ, మణుగూరు: సమాజంలో వికలాంగులను ఆదరించి, గౌరవించాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం టీ కొత్తగూడెంలోని సాధనపళ్లి అచ్చయ్య అనే నిరుపేద వికలాంగుడిని ఆదుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అచ్చయ్య అనే వ్యక్తికి కిడ్నీలు చెడిపోవడంతో రెండు కాళ్లు పని చేయకుండా పూర్తిగా వికలాంగుడిగా మారిపోయాడన్నారు. అచ్చయ్య కు వికాస్ అగ్రి ఫౌండేషన్ నుండి ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఖరీదైన వీల్ చైర్ ను,1500 నగదును అందించానని తెలిపారు.
సమాజంలోని వికలాంగులను ఎవరూ తక్కువ చూపు చూడకూడని మాట్లాడిన్నారు. మండలంలోని వికలాంగులకు అండగా ఉంటానాని తెలిపారు. వికలాంగులు తమ అవిటితనాన్ని చూసి బాధపడకుండా, సమాజంలో ధైర్యం బతకాలని సూచించారు. ఈకార్యక్రమంలో సాధనపళ్లి లాలమ్మ, యలం దాసరి ముత్తయ్య, తిరుపతిరావు, శేషారెడ్డి, స్వామిబాబు తదితరులు పాల్గొన్నారు.