వారికి తెలంగాణ ప్రభుత్వం తీపికబురు.. త్వరలో జీతాల పెంపు?

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా నియంత్రణకు నిర్విరామంగా కృషి చేస్తున్న ఆశా వర్కర్ల జీతాలు పెంచాలని ప్రభుత్వం అంతర్గత నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇస్తున్న రూ.7500 నుంచి రూ.9750కి పెంచాలని సర్కార్ భావిస్తుంది. వచ్చే నెల నుంచి వేతనాలు పెంచేందుకు కసరత్తులు చేస్తున్నారు. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా 27,500 మంది ఆశా వర్కర్లు లబ్ధి పొందనున్నారు. స్వరాష్ట్రంలో ఆశాలకు జీతాలు పెరగడం ఇది మూడోసారి. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో ఆశాలకు గౌరవ వేతనం కింద రూ.1800 ఇచ్చేవారు. […]

Update: 2021-11-26 17:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా నియంత్రణకు నిర్విరామంగా కృషి చేస్తున్న ఆశా వర్కర్ల జీతాలు పెంచాలని ప్రభుత్వం అంతర్గత నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇస్తున్న రూ.7500 నుంచి రూ.9750కి పెంచాలని సర్కార్ భావిస్తుంది. వచ్చే నెల నుంచి వేతనాలు పెంచేందుకు కసరత్తులు చేస్తున్నారు. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా 27,500 మంది ఆశా వర్కర్లు లబ్ధి పొందనున్నారు. స్వరాష్ట్రంలో ఆశాలకు జీతాలు పెరగడం ఇది మూడోసారి. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో ఆశాలకు గౌరవ వేతనం కింద రూ.1800 ఇచ్చేవారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రూ.6 వేలకు పెంచారు. ఆ తర్వాత మరోసారి ఆశాల కోరిక మేరకు రూ.7500కు పెంచారు. ప్రతీ నెల ఆశాలకు వచ్చే జీతంలో కేంద్రం రూ.1800 చెల్లిస్తుంది. మరోవైపు అందరి ఆశాలకు జీతాలు ఒకేలా లేవని, పనితీరు ప్రకారం ఇస్తున్నారని ఆశాలు చెబుతున్నారు. దీనితో తమకు ఇబ్బంది అవుతున్నట్లు ఆశాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగిన పీఆర్సీ ప్రకారం తమకు కూడా నెలకు రూ.12 వేల చొప్పున ఇవ్వాలని కోరుతున్నారు.

Tags:    

Similar News