ట్యాప్ చేసింది మీరు.. మేము కాదు : సజ్జల

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో ఫొన్ ట్యాపింగ్ విషయమై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య రచ్చ కొనసాగుతూనే ఉంది. ఇటీవల, వైసీపీ ప్రభుత్వం తమ ఫొన్లు ట్యాప్ చేస్తోందని, దీనిపై విచారణ జరిపించాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ విషయంలో తాను వెనక్కి తగ్గబోనని స్పష్టంచేశారు. అయితే, చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు. తాజాగా, ఆ విషయంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తాము […]

Update: 2020-08-19 10:34 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో ఫొన్ ట్యాపింగ్ విషయమై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య రచ్చ కొనసాగుతూనే ఉంది. ఇటీవల, వైసీపీ ప్రభుత్వం తమ ఫొన్లు ట్యాప్ చేస్తోందని, దీనిపై విచారణ జరిపించాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ విషయంలో తాను వెనక్కి తగ్గబోనని స్పష్టంచేశారు. అయితే, చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు.

తాజాగా, ఆ విషయంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తాము ప్రతిపక్షంలో ఉన్నపుడు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఫోన్‌ను ట్యాప్‌ చేయించారని సజ్జల అన్నారు. అందుకు తగిన ఆధారాలను న్యాయస్థానానికి సమర్పించినట్లు వివరించారు. ఏవైనా ఆరోపణలు చేసేముందు ఆధారాలు చూపాల్సి ఉంటుందని.. ఫొన్‌ ట్యాపింగ్‌ జరిగిందని ఆరోపిస్తున్న చంద్రబాబు దానికి చెందిన ఆధారాలు ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం ట్వీట్‌ చేసిన సజ్జల.. టీడీపీ హయాంలో తన ఫొన్‌ ట్యాపింగ్‌కు సంబంధించిన పత్రాలను పబ్లిక్‌గా షేర్‌ చేశారు.

Tags:    

Similar News