రెండు గ్రామాల్లో విషాదం.. సర్పంచ్ అకాల మృతి
దిశ, గుండాల : గుండాల మండలంలోని సాయన పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ బచ్చలి లక్ష్మీ నర్సు అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. 2019 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సాయనపల్లి గ్రామపంచాయతీ నుండి భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. వివాదరహితుడిగా నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగిన వ్యక్తిగా మంచి పేరున్న లక్ష్మీ నరసింహ మృతితో ఆయన స్వగ్రామం తక్కెళ్ల గూడెంలో, సాయన పల్లిలో విషాద ఛాయలు నెలకొన్నాయి. 2019 నుండి సాయన […]
దిశ, గుండాల : గుండాల మండలంలోని సాయన పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ బచ్చలి లక్ష్మీ నర్సు అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. 2019 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సాయనపల్లి గ్రామపంచాయతీ నుండి భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. వివాదరహితుడిగా నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగిన వ్యక్తిగా మంచి పేరున్న లక్ష్మీ నరసింహ మృతితో ఆయన స్వగ్రామం తక్కెళ్ల గూడెంలో, సాయన పల్లిలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
2019 నుండి సాయన పల్లి పంచాయతీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఆయన మృతి పట్ల సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, అల్లపల్లి వైస్ ఎంపీపీ రేస్ ఎల్లయ్య. గుండాల ఎంపీపీ ముతి సత్యం, జడ్పీటీసీగా వంగబోయినా రామక్క, గుండాల సర్పంచ్ సీతారాములు, న్యూ డెమోక్రసీ నాయకులు ఈసం శంకర్, తెలుగుదేశం నాయకులు అప్పారావు, కాంగ్రెస్ నాయకులు ముత్యమా చారి, మండలంలోని సర్పంచులు ఎంపీటీసీలు వివిధ పార్టీ నాయకులు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.