మా ప్రభుత్వాలు కూలుస్తున్నారు: శైలజానాథ్

దిశ, ఏపీ బ్యూరో: మా ప్రభుత్వాలను కూలగొడుతున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వాలను కూలగొడుతుందని మండిపడ్డారు. కరోనా వైరస్ స్వైర విహారం చేస్తున్న సమయంలో దాని నివారణ చర్యలు చేపట్టకుండా కుట్ర రాజకీయాలకు తెరతీస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ పోరాడుతుందని ఆయన చెప్పారు. ప్రజల మేలు, దేశం మేలు కోరే వారు బీజేపీ అరాచకాలను ప్రశ్నించాలని ఆయన పిలుపునిచ్చారు. అంబేద్కర్ రూపొందించిన […]

Update: 2020-07-27 02:03 GMT

దిశ, ఏపీ బ్యూరో: మా ప్రభుత్వాలను కూలగొడుతున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వాలను కూలగొడుతుందని మండిపడ్డారు. కరోనా వైరస్ స్వైర విహారం చేస్తున్న సమయంలో దాని నివారణ చర్యలు చేపట్టకుండా కుట్ర రాజకీయాలకు తెరతీస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ పోరాడుతుందని ఆయన చెప్పారు. ప్రజల మేలు, దేశం మేలు కోరే వారు బీజేపీ అరాచకాలను ప్రశ్నించాలని ఆయన పిలుపునిచ్చారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగానికి మోదీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోదని ఆయన మండిపడ్డారు. రాజస్థాన్ అసెంబ్లీని వెంటనే సమావేశ పరచాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags:    

Similar News