కూతురి కోసం సైఫ్ లాలిపాట.. వద్దన్న సారా అలీ ఖాన్
దిశ, సినిమా : ‘ది కపిల్ శర్మ’ షోలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్.. తన కుమార్తె సారా అలీ ఖాన్‌తో చిన్నపుడు గడిపిన ఓ సరదా సన్నివేశాన్ని ప్రేక్షకులతో పంచుకుంటూ.. షోలో నవ్వులు పూయించాడు. సారా కోసం లాలిపాట పాడిన అనుభవం గురించి చెబుతూ.. ‘నేను తనకోసం ఒకసారి ఓ ఇంగ్లీష్ లాలిపాట (సమ్మర్‌టైమ్) పాడాను. దాంతో వెంటనే సారా తన కళ్ళు పెద్దగా తెరిచి అబ్బా ప్లీజ్.. దయచేసి […]
దిశ, సినిమా : ‘ది కపిల్ శర్మ’ షోలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్.. తన కుమార్తె సారా అలీ ఖాన్‌తో చిన్నపుడు గడిపిన ఓ సరదా సన్నివేశాన్ని ప్రేక్షకులతో పంచుకుంటూ.. షోలో నవ్వులు పూయించాడు. సారా కోసం లాలిపాట పాడిన అనుభవం గురించి చెబుతూ.. ‘నేను తనకోసం ఒకసారి ఓ ఇంగ్లీష్ లాలిపాట (సమ్మర్‌టైమ్) పాడాను. దాంతో వెంటనే సారా తన కళ్ళు పెద్దగా తెరిచి అబ్బా ప్లీజ్.. దయచేసి నీవు పాట పాడవద్దు. నేను తిరిగి ఆ పాట పాడలేనని తన హావభావాలను వ్యక్తపరిచింది. దాంతో ఇక లాలిపాట పాడటం మానేశాను’ అని వివరించాడు. ఇక కపిల్ సైఫ్‌ని తన పిల్లల గురించి అడిగినపుడు.. నాలుగు ఖరీదైన వివాహాలకు ఆతిథ్యం ఇవ్వడానికి చాలా భయపడుతున్నానని, ఇప్పుడు తను నలుగురు పిల్లలకు తండ్రి అంటూ మరోసారి జోక్ పేల్చాడు హీరో. అలాగే లాక్డౌన్ సమయంలో ఏమి చేశారని అడిగినప్పుడు.. మొదటి లాక్డౌన్లో ఫ్రెంచ్ లాంగ్వేజ్, కుకింగ్.. రెండవ లాక్డౌన్లో సెకండ్ బేబి బాయ్ పుట్టాడని సైఫ్ తెలిపాడు.