Panjab: సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మంగళవారం శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ) నేతలు, కార్యకర్తలు సీఎం అమరీందర్ సింగ్ నివాసాన్ని ముట్టడించడానికి ప్రయత్నించారు. గతకొన్ని రోజులుగా  పంజాబ్ లో వ్యాక్సిన్ స్కామ్ జరిగిందని గత కొద్దీ రోజులుగా ప్రతిపక్ష పార్టీ శిరోమణి అకాళీదర్, ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోఎం ఈరోజు సీఎం ఇంటి ముట్టడికి పిలుపునించింది. దీంతో వేలసంఖ్యలో శిరోమణి అకాలీ దళ్ […]

Update: 2021-06-15 04:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మంగళవారం శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ) నేతలు, కార్యకర్తలు సీఎం అమరీందర్ సింగ్ నివాసాన్ని ముట్టడించడానికి ప్రయత్నించారు. గతకొన్ని రోజులుగా పంజాబ్ లో వ్యాక్సిన్ స్కామ్ జరిగిందని గత కొద్దీ రోజులుగా ప్రతిపక్ష పార్టీ శిరోమణి అకాళీదర్, ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోఎం ఈరోజు సీఎం ఇంటి ముట్టడికి పిలుపునించింది. దీంతో వేలసంఖ్యలో శిరోమణి అకాలీ దళ్ నేతలు సీఎం ఇంటిముందు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్ సింగ్ సిద్ధూను బర్తరఫ్ చేయాలన్న డిమాండ్ తో ఆ పార్టీ నేతలు చేసిన ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో పోలీసులు సీఎం ఇంటిముందు భారీగా మోహరించారు. భారికేట్లను తొలగించి సీఎం ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేసిన శిరోమణి అకాలీ దళ్ నేతలను చెదరగొట్టడానికి పోలీసులు వాటర్ కెనాన్ ప్రయోగించారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్ కి తరలించారు.

Tags:    

Similar News