హెల్మెట్‌పై సచిన్ ట్వీట్ వైరల్!
దిశ, వెబ్‌డెస్క్ : హెల్మెట్ వినియోగంపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. అనుకోకుండా వచ్చే ప్రమాదాల నుంచి ‘హెల్మెట్’మనల్ని ఏ విధంగా రక్షిస్తుందో కళ్లకు కట్టినట్లు చూపించేలా ఓ వీడియాను ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ‘ముంబై వర్సెస్ సన్ రైజర్స్’ ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై ఆటగాడిని రన్ ఔట్ చేయాలని హైదరాబాద్ ప్లేయర్ విసిరిన బంతి నేరుగా ‘దవల్ కులకర్ణి’తలకు వేగంగా వచ్చి తాకింది. […]
దిశ, వెబ్‌డెస్క్ : హెల్మెట్ వినియోగంపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. అనుకోకుండా వచ్చే ప్రమాదాల నుంచి ‘హెల్మెట్’మనల్ని ఏ విధంగా రక్షిస్తుందో కళ్లకు కట్టినట్లు చూపించేలా ఓ వీడియాను ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు.
దుబాయ్ వేదికగా జరుగుతున్న ‘ముంబై వర్సెస్ సన్ రైజర్స్’ ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై ఆటగాడిని రన్ ఔట్ చేయాలని హైదరాబాద్ ప్లేయర్ విసిరిన బంతి నేరుగా ‘దవల్ కులకర్ణి’తలకు వేగంగా వచ్చి తాకింది. దీంతో హెల్మెల్ వెనుక భాగం డ్యామెజ్ అవడమే కాకుండా దాని భాగాలు విరిగి పడ్డాయి. ఆ బంతి వచ్చి తలకు తాకిన సమయంలో హెల్మెట్ లేకపోతే ఎమై ఉండేదని సచిన్ షేర్ చేసిన వీడియో ఒక్కసారిగా అందరినీ ఆలోచనలో పడేసింది. అందువల్లే ప్రతి ఒక్కరూ శిరణాస్త్రం ధరించాలని సచిన్ కోరారు. చివరగా ‘థాంక్ గాడ్ మై ఫ్రెండ్ కులకర్ణి హెల్మెట్ పెట్టుకున్నాడు’అని ట్వీట్ చేశాడు.
Another example of why helmets need to be made mandatory.
Thank God my friend @dhawal_kulkarni was wearing one.@BoriaMajumdar https://t.co/3ZRv8fGLKe— Sachin Tendulkar (@sachin_rt) November 3, 2020