గొప్ప మనసు చాటుకున్న సచిన్.. కోవిడ్ బాధితులకు భారీ విరాళం

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులతో పాటు, అనేకమంది మహమ్మారి బారినపడి ప్రాణాలు వదులుతున్నారు. మరీ ముఖ్యంగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా రోగులకు ఆక్సిజన్ అందక మరణిస్తున్నారు. ఈ క్రమంలో క్రికెట్ గాడ్, టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. కరోనా సెకండ్ వేవ్ బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చాడు. ఈ ప్రాణాంతక వైరస్‌ కారణంగా ఆక్సిజన్ కొరతతో బాధపడుతున్న వారికి సాయం చేసేందుకు ‘మిషన్ […]

Update: 2021-04-29 20:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులతో పాటు, అనేకమంది మహమ్మారి బారినపడి ప్రాణాలు వదులుతున్నారు. మరీ ముఖ్యంగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా రోగులకు ఆక్సిజన్ అందక మరణిస్తున్నారు. ఈ క్రమంలో క్రికెట్ గాడ్, టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. కరోనా సెకండ్ వేవ్ బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చాడు. ఈ ప్రాణాంతక వైరస్‌ కారణంగా ఆక్సిజన్ కొరతతో బాధపడుతున్న వారికి సాయం చేసేందుకు ‘మిషన్ అక్సిజన్’ అనే సంస్థకు తన వంతుగా కోటీ రూపాయాల ఆర్థిక సాయాన్ని అందజేశాడు.

ఈ విషయాన్ని మాస్టరే ట్విటర్ వేదికగా ప్రకటించాడు. 250 మందికి పైగా యువకులతో మిషన్ ఆక్సిజన్ సంస్థ వైరస్ బాధితులకు ఆక్సిజన్ అందించేందుకు పనిచేస్తోంది. దేశంలో మొదటి సారి కరోనా విపత్తు సంభవించినప్పుడు ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు విరాళాన్ని అందజేసిన మాస్టర్.. ప్రస్తుతం మరోసారి తన గొప్ప మనసు చాటుకోవడంతో మాస్టర్‌పై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

https://twitter.com/sachin_rt/status/1387760979136585729?s=20

Tags:    

Similar News