సచిన్ వర్గానికి ఊరట
దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ హైకోర్టులో సచిన్ పైలట్ వర్గానికి ఊరట లభించింది. సచిన్ పైలట్ వర్గంపై ఎలాంటి చర్యలు తీసుకోవొద్దని హైకోర్టు ఆదేశించింది. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా యథాస్థితిని కొనసాగించాలని పేర్కొన్నది. దీంతో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు ఎదురుదెబ్బ తగిలినట్టు అయింది. కాగా, సచిన్ పైలట్ దాఖలు చేసిన పిటిషన్ ను శుక్రవారం ధర్మాసనం విచారించింది. అనంతరం తీర్పు వెల్లడించింది. సచిన్ పైలట్ వర్గం వాదనతో కోర్టు ఏకీభవిస్తూ కేంద్రాన్ని కూడా ప్రతివాదిగా […]
దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ హైకోర్టులో సచిన్ పైలట్ వర్గానికి ఊరట లభించింది. సచిన్ పైలట్ వర్గంపై ఎలాంటి చర్యలు తీసుకోవొద్దని హైకోర్టు ఆదేశించింది. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా యథాస్థితిని కొనసాగించాలని పేర్కొన్నది. దీంతో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు ఎదురుదెబ్బ తగిలినట్టు అయింది. కాగా, సచిన్ పైలట్ దాఖలు చేసిన పిటిషన్ ను శుక్రవారం ధర్మాసనం విచారించింది. అనంతరం తీర్పు వెల్లడించింది. సచిన్ పైలట్ వర్గం వాదనతో కోర్టు ఏకీభవిస్తూ కేంద్రాన్ని కూడా ప్రతివాదిగా చేర్చింది. అయితే.. గతకొద్ది రోజుల నుంచి రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. సొంత ప్రభుత్వంపైనే సచిన్ పైలట్ బృందం తిరుగుబాటు జెండ ఎగురవేయడంతో వారిని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన విషయం విధితమే. అనంతరం వారికి స్పీకర్ అనర్హత నోటీసులు జారీ చేయంతో వారు హైకోర్టు వెళ్లిన విషయమూ తెలిసిందే.