సచిన్ ఆరు నెలల కిందే బీజేపీలో చేరాలనుకున్నాడు : గెహ్లాట్
దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్‌లో కాంగ్రెస్ యువనేత, సీనియర్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ మాజీ డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ పై తీవ్ర విమర్శలు చేశారు. సచిన్ ఆరు నెలల కిందటే బీజేపీలో చేరాలనుకున్నాడని.. అతని మద్దతుదారులు వ్యతిరేకించడంతో ఆగిపోయాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అనుకున్నది నేరవేరకపోవడం వల్లే ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నించాడని స్పష్టం చేశారు. అయితే, ప్రస్తుతం పైలట్ […]
దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్‌లో కాంగ్రెస్ యువనేత, సీనియర్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ మాజీ డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ పై తీవ్ర విమర్శలు చేశారు. సచిన్ ఆరు నెలల కిందటే బీజేపీలో చేరాలనుకున్నాడని.. అతని మద్దతుదారులు వ్యతిరేకించడంతో ఆగిపోయాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అనుకున్నది నేరవేరకపోవడం వల్లే ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నించాడని స్పష్టం చేశారు. అయితే, ప్రస్తుతం పైలట్ వద్ద 15 నుంచి 17 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని వివరించారు. ఇప్పుడు అతను కొత్త పార్టీ పెడితే బీజేపీ తప్పుకుండా మద్దతిస్తుందని సీఎం గెహ్లాట్ ఆరోపించారు.