మార్కెట్లోకి రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్-వి

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచాన్ని అత్యంత దారుణంగా వణికిస్తున్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను రష్యా మార్కెట్లో విడుదల చేసింది. స్పుత్నిక్-వి (Sputnik-V)వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి విడుదల చేసినట్టు రష్యా ఆరోగ్య శాఖ ప్రకటించింది. రానున్న కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా పంపిణీ చేయనున్నట్టు వెల్లడించింది. రష్యాకు చెందిన గమాలియా నేషనల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆఫ్ ఎపిడెమియాలజీ, రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ను తయారు చేశాయి. క్లినికల్ పరీక్షలు ఉత్తమమైన ఫలితాలను సాధించడంతో, ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నట్టు ఆరోగ్య […]

Update: 2020-09-08 07:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచాన్ని అత్యంత దారుణంగా వణికిస్తున్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను రష్యా మార్కెట్లో విడుదల చేసింది. స్పుత్నిక్-వి (Sputnik-V)వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి విడుదల చేసినట్టు రష్యా ఆరోగ్య శాఖ ప్రకటించింది. రానున్న కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా పంపిణీ చేయనున్నట్టు వెల్లడించింది. రష్యాకు చెందిన గమాలియా నేషనల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆఫ్ ఎపిడెమియాలజీ, రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ను తయారు చేశాయి.

క్లినికల్ పరీక్షలు ఉత్తమమైన ఫలితాలను సాధించడంతో, ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నట్టు ఆరోగ్య శాఖ పేర్కొంది. గత నెల 11న రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ కరోనా వైరస్‌కు స్పుత్నిక్-వి (Sputnik-V) తొలి వ్యాక్సిన్‌ను సిద్ధం చేసినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాము సిద్ధం చేస్తున్న వ్యాక్సిన్ కోసం అనేక దేశాలు ఆర్డర్లు చేస్తున్నాయని, సుమారు 20 దేశాల నుంచి డిమాండ్ ఉందని డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ తెలిపింది. అలాగే, ఇప్పటికే రెండు దశల క్లినికల్ పరీక్షలను పూర్తి చేసుకున్న రష్యా వ్యాక్సిన్..తదుపరి పరీక్షలను భారత్‌లో నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికోసం భారత అధికారులను సంప్రదిస్తున్నట్టు డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ పేర్కొంది.

Tags:    

Similar News