ఇండియాతో కలిసి వ్యాక్సిన్ తయారీపై రష్యా ఇంట్రెస్ట్..
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళనృత్యం చేస్తోంది. ఈ తరుణంలో తాము ఆ మహమ్మారికి మందును కనిపెట్టినట్లు రష్యా ప్రకటించిన సంగతి తెలిసిందే. రష్యా వ్యాక్సిన్‌పై పలు దేశాలతో పాటు, డబ్ల్యూహెచ్‌వో కూడా పలు అనుమానాలు వ్యక్తం చేసింది. ఎందుకంటే రష్యా ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించకుండా వ్యాక్సిన్ తయారీ చేసినట్లు ప్రకటించుకోవడమే అందుకు కారణంగా తెలుస్తోంది. ఆ తర్వాత, రష్యాతో భారత ఫార్మా కంపెనీలు సంప్రదింపులు జరిపాయి. ఫేజ్-1, ఫేజ్-2కు సంబంధించిన క్లినికల్ […]
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళనృత్యం చేస్తోంది. ఈ తరుణంలో తాము ఆ మహమ్మారికి మందును కనిపెట్టినట్లు రష్యా ప్రకటించిన సంగతి తెలిసిందే. రష్యా వ్యాక్సిన్‌పై పలు దేశాలతో పాటు, డబ్ల్యూహెచ్‌వో కూడా పలు అనుమానాలు వ్యక్తం చేసింది. ఎందుకంటే రష్యా ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించకుండా వ్యాక్సిన్ తయారీ చేసినట్లు ప్రకటించుకోవడమే అందుకు కారణంగా తెలుస్తోంది.
ఆ తర్వాత, రష్యాతో భారత ఫార్మా కంపెనీలు సంప్రదింపులు జరిపాయి. ఫేజ్-1, ఫేజ్-2కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ రిపోర్టులు కావాలని కోరాయి. ఈ విషయాన్ని రష్యన్ అధికార యంత్రాంగం కూడా ధృవీకరించింది. అయితే, రష్యా వ్యాక్సిన్ తయారీ అనంతరం తొలి కరోనా వ్యాక్సిన్‌గా స్పుత్నిక్ వీ రిజిస్ట్రేషన్ కూడా చేయించింది.
తాజాగా రష్యా- భారత్‌తో కలిసి కరోనా వ్యాక్సిన్ తయారీలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నట్లు రష్యన్ డైరెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సీఈవో కిరిల్ డ్నిట్రీవ్ ప్రకటించారు. ఇరుదేశాలు కలసి స్పుత్నిక్ వీ తయారీ చేయాలని.. ఇండియా భావిస్తే తాము అందుకు సంసిద్ధతను వ్యక్తం చేస్తామని ఆయన తెలిపారు. కాగా, రష్య ప్రకటనపై భారత్ ఏవిధంగా స్పందిస్తుందో వేచిచూడాలి.