తెప్పపై రుక్మిణీకృష్ణుల అభయం

దిశ, వెబ్‌డెస్క్ : తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో రెండో రోజు గురువారం రాత్రి రుక్మిణీకృష్ణులు భక్తులకు అభయమిచ్చారు. కోవిడ్‌-19 నిబంధ‌న‌లు పాటిస్తూ పుష్కరిణిలో తెప్పోత్సవాలు నిర్వహించారు. ముందుగా రుక్మిణీకృష్ణుల ఉత్సవమూర్తుల ఊరేగింపు సాయంత్రం 6 గంటలకు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. రెండో రోజు స్వామి, అమ్మవారు మూడు చుట్లు తిరిగి భక్తులను అనుగ్రహించారు. మంగళవాయిద్యం‌, వేదపండితుల వేదఘోష, అన్నమాచార్య ప్రాజెక్టు సంకీర్తనల మధ్య తెప్పోత్సవం కనువిందుగా జరిగింది. […]

Update: 2021-03-26 11:17 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో రెండో రోజు గురువారం రాత్రి రుక్మిణీకృష్ణులు భక్తులకు అభయమిచ్చారు. కోవిడ్‌-19 నిబంధ‌న‌లు పాటిస్తూ పుష్కరిణిలో తెప్పోత్సవాలు నిర్వహించారు.

ముందుగా రుక్మిణీకృష్ణుల ఉత్సవమూర్తుల ఊరేగింపు సాయంత్రం 6 గంటలకు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. రెండో రోజు స్వామి, అమ్మవారు మూడు చుట్లు తిరిగి భక్తులను అనుగ్రహించారు. మంగళవాయిద్యం‌, వేదపండితుల వేదఘోష, అన్నమాచార్య ప్రాజెక్టు సంకీర్తనల మధ్య తెప్పోత్సవం కనువిందుగా జరిగింది. కార్యక్రమంలో టీటీడీ ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఏవి ధ‌ర్మారెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ డీపీ అనంత, శ్రీసీ ప్రసాద్, సీఈ శ్రీ ర‌మేష్‌రెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరింద్రనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News