ఇంకా ఫైనల్ కాలే..

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ చర్చలు ఎటూ తెగడం లేదు. తెలంగాణ సూచించిన మేరకు కిలోమీటర్లను తగ్గించుకుని ప్రతిపాదనలు పంపించిన ఏపీ అధికారులు తెలంగాణ ఆర్టీసీ అధికారులతో ఫోన్‌లో చర్చించారు. ఈ సందర్భంగా చర్చలు జరిపినా ప్రతిష్టంభన వీడలేదు. ఫలితంగా ఈనెలాఖరు వరకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అంతరాష్ట్ర సర్వీసులు నడిచే అవకాశాలు లేవు. ఇప్పటికే రెండుసార్లు ఏపీ ప్రతిపాదనలు పంపించినా.. తెలంగాణ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. తాజాగా మళ్లీ చర్చలు విఫలమే కావడంతో […]

Update: 2020-10-23 20:41 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ చర్చలు ఎటూ తెగడం లేదు. తెలంగాణ సూచించిన మేరకు కిలోమీటర్లను తగ్గించుకుని ప్రతిపాదనలు పంపించిన ఏపీ అధికారులు తెలంగాణ ఆర్టీసీ అధికారులతో ఫోన్‌లో చర్చించారు. ఈ సందర్భంగా చర్చలు జరిపినా ప్రతిష్టంభన వీడలేదు. ఫలితంగా ఈనెలాఖరు వరకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అంతరాష్ట్ర సర్వీసులు నడిచే అవకాశాలు లేవు. ఇప్పటికే రెండుసార్లు ఏపీ ప్రతిపాదనలు పంపించినా.. తెలంగాణ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. తాజాగా మళ్లీ చర్చలు విఫలమే కావడంతో ఈ పండుగకు కూడా ఆర్టీసీ అంతరాష్ట్ర సర్వీసులు లేనట్టేనని తేలిపోయింది. కనీసం పండుగ సమయంలోనైనా బస్సులు నడుపుదామని ఏపీ అధికారులు కోరినా తెలంగాణ తిరస్కరించింది. తాజాగా నాలుగు రోజుల కిందట తెలంగాణ డిమాండ్ల మేరకు ఏపీ ప్రతిపాదనలు పంపించింది.

వీటిపై ఏపీ అధికారులు శుక్రవారం ఫోన్‌లో తెలంగాణ అధికారులతో చర్చించారు. టీఎస్‌ ఆర్టీసీ అధికారులు కోరిన ప్రతిపాదనలకు తాము సానుకూలంగా ఉన్నామని ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు శుక్రవారం ప్రకటించారు. ఏపీకి పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్నా1.6 లక్షల కిమీలకు తగ్గామని పేర్కొన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ముందునుంచీ చెప్పినట్టుగానే రూట్ల వారీగా కూడా క్లారిటీ వచ్చింది. వారం రోజుల కిందటే ఈ ప్రతిపాదనలు వచ్చినా.. రవాణా శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ ప్రతిపాదనలను సీఎం కేసీఆర్‌కు పంపించారు. తెలంగాణ పరిధిలో ఏపీ ఆర్టీసీ బస్సులు 2.64 లక్షల కిలోమీటర్లు ఉండగా, తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఏపీ భూభాగంలో 1.61 లక్షలు తిరుగుతున్నాయి. దీనిపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఏపీ సర్వీసులను తగ్గించుకోవాలనే డిమాండ్‌పై రెండు నెలలుగా చర్చలు సాగుతూనే ఉన్నాయి.

అయితే దీనిలో భాగంగా ఈ నెల 21న ఏపీ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి తెలంగాణకు ప్రతిపాదనలు పంపించారు. సమాన కిలోమీటర్ల ప్రాతిపదికన అంగీకారం తెలుపుతున్నామని, 1.61 లక్షల కిలోమీటర్ల ప్రాతిపదికన బస్సులు తిప్పుదామని ప్రతిపాదించింది. దసరా పండుగ నేపథ్యంలో త్వరగా స్పందించాలని, పండుగ సమయంలోనైనా బస్సులు నడుపాదని కోరారు. వీటిపై నిర్ణయం తీసుకునే అధికారం లేదంటూ రవాణా శాఖ మంత్రితో పాటు ఆర్టీసీ ఎండీ సైతం చెప్పుతున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని, అయితే ఏపీ ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ కొన్ని సవరణలు చేశారని, వాటిని తిరిగి పంపించినట్టు వెల్లడించారు.

ప్రయాణికులకు ఇబ్బందులు..

పండగ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల నడుమ లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో అతిపెద్ద పండుగ కాగా… ఏపీలో కూడా సంక్రాంతి తర్వాత ఘనంగా జరుపుకొనే వేడుక ఇదే. ఈ పండుగ వేళ హైదరాబాద్‌ సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఏపీ ప్రజలు ఏడెనిమిది లక్షల మంది సొంతూళ్లకు వెళ్తారు. పండుగకు నాలుగైదు రోజుల ముందు నుంచి వారి ప్రయాణాలు మొదలవుతాయి. ఆర్టీసీకి కూడా దసరా సీజన్‌ కలెక్షన్లు కురిపిస్తుంది. ఈ సమయంలో చార్జీలు అధికారికంగా 50 శాతం పెంచినా ప్రజలు దాన్ని అంతగా పట్టించుకోరు.

ఇదిలా ఉండగా శుక్రవారం తెలంగాణ రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మతో ఆర్టీసీ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ట్రాన్స్ పోర్టు భవన్‌లో సమావేశమయ్యారు. ఏపీ ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకుంటారని భావించినా సీఎం నుంచి సవరణల అంశాలు రాకపోవడంతో ఈ అంశాన్ని తేల్చలేదు.

Tags:    

Similar News