కరోనా వల్ల ఆర్టీసీ తీవ్రంగా నష్టపోయింది.. ద్వారకా తిరమల రావు
దిశ, ఏపీ బ్యూరో : తిరుపతి బస్టాండ్‌ను 12 అంతస్తులతో ఇంటిగ్రేడ్ బస్టాండ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు స్పష్టం చేశారు. తిరుపతిలో పర్యటించిన ఆయన తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో మరింత అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. తిరుమల ఘాట్ రోడ్‌లో బ్యాటరీ వాహనాల ఆర్టీసీ బస్సులు నడపాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. బ్యాటరీ బస్సులు నడపడం వల్ల పర్యావరణాన్ని కాపాడినవారమవుతామని ఆయన అభిప్రాయపడ్డారు. అందులో భాగంగా […]
దిశ, ఏపీ బ్యూరో : తిరుపతి బస్టాండ్‌ను 12 అంతస్తులతో ఇంటిగ్రేడ్ బస్టాండ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు స్పష్టం చేశారు. తిరుపతిలో పర్యటించిన ఆయన తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో మరింత అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. తిరుమల ఘాట్ రోడ్‌లో బ్యాటరీ వాహనాల ఆర్టీసీ బస్సులు నడపాలని నిర్ణయించామని స్పష్టం చేశారు.
బ్యాటరీ బస్సులు నడపడం వల్ల పర్యావరణాన్ని కాపాడినవారమవుతామని ఆయన అభిప్రాయపడ్డారు. అందులో భాగంగా తిరుమలకు 50, ఇతర ప్రాంతాలకు 50 బ్యాటరీ బస్సులు కేటాయించినట్లు తెలిపారు. ఇకపోతే కరోనా కారణంగా ఆర్టీసీ తీవ్రంగా నష్టపోయిందని తెలిపారు. థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఆర్టీసీ సిబ్బంది రెడీగా ఉందని తెలిపారు. ఏసీ బస్సులతో పాటు ప్రతీ బస్సును శానిటైజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. మాస్కులు ధరిస్తేనే ఆర్టీసీ బస్సులోకి ప్రయాణికులను అనుమతిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు.