డిసెంబర్ 15 నాటికి ఏపీలో కొత్త విధానం.. త్వరలోనే అసెంబ్లీకి బిల్లు

భవన నిర్మాణ అనుమతులకు త్వరలో కొత్త విధానం తీసుకొస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు..

Update: 2024-11-17 17:08 GMT

దిశ, వెబ్ డెస్క్: భవన నిర్మాణ అనుమతుల(Building permits)కు త్వరలో కొత్త విధానం తీసుకొస్తున్నామని మంత్రి నారాయణ(Minister Narayana) తెలిపారు. నెల్లూరు మున్సిపల్ అధికారుల(Nellore Muncipal Officers)తో సమీక్ష నిర్వహించిన ఆయన డిసెంబర్ 15 నాటికి కొత్త విధానం అమలులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే అసెంబ్లీలో బిల్లు పెడతామని చెప్పారు. 20 రాష్ట్రాల్లో అధ్యయనం తర్వాతే కొత్త విధానంపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మున్సిపాలటీలు, పంచాయతీల(Municipalities and Panchayats) అభివృద్ధి కోసం ప్రజలు చెల్లించాల్సిన పన్నులను సత్వరమే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. వాణిజ్య సంస్థలు భారీగా బకాయిలు ఉన్నాయని, త్వరగా చెల్లించాలని మంత్రి నారాయణ కోరారు. 

Tags:    

Similar News