AP News: సీఎం చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు

సీఎం చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు..

Update: 2024-12-09 16:54 GMT

దిశ, వెబ్ డెస్క్: పంట బీమాపై వైసీపీ(Ycp), టీడీపీ(Tdp) నేతల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. పంట బీమా(Crop Insurance) కల్పించింది తమ హయాంలోనే అంటూ రెండు పార్టీల నాయకులు చెప్పుకుంటున్నారు. పంటల బీమాపై తాజాగా వైసీపీ మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి (Former Minister Kakani Govardhan Reddy) మీడియాతో మాట్లాడారు. అన్ని పంటలకూ బీమా ఇచ్చింది వైయస్ఆర్ కాంగ్రెస్(YSR Congress) ప్రభుత్వమేనని చెప్పారు. పంటబీమా ప్రీమియంను పూర్తిగా భరించింది వైఎస్ జగన్(YS Jagan) హయాంలోనేనని కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.


 తుఫాన్లు, వరదలు వచ్చినా వ్యవసాయశాఖా మంత్రి, పౌరసరఫరాల మంత్రి ఒక్క సమీక్ష కూడా చేయలేదని కాకాని వ్యాఖ్యానించారు. ధాన్యం బస్తాకు రూ.1,700 కూడా ధర రాని దారుణమైన పరిస్థితి అని చెప్పారు. రైతులు నష్టపోతుంటే, దళారులు బాగుపడుతున్నారన్నారు. వ్యవసాయరంగంపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఎద్దేవా చేశారు. 2014-19లో ధాన్యం రైతులకు చంద్రబాబు రూ.960 కోట్లు బకాయిలుపెట్టి వెళ్లిపోయారని, ఇప్పుడు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Tags:    

Similar News