Gun misfire : నాటు తుపాకి మిస్ ఫైర్.. ఒకరు మృతి
ఏపీలోని నెల్లూరు(Nellore) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.
దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని నెల్లూరు(Nellore) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని రాపూర్ మండలం పెనుబర్తి గ్రామానికి చెందిన ముగ్గురు గిరిజనులు ఆదివారం నాటుతుపాకీతో(Gun misfire) అడవిపందుల వేటకు వెళ్లారు. ప్రమాదవాశాత్తు ఒకరి చేతిలో ఉన్న తుపాకీ పేలడంతో తాళ్ల సుధాకర్ అనే వ్యక్తికి తగిలింది. తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.