ఆర్టీసీ ఉద్యోగులకు పెట్రోల్ బంకుల్లో డ్యూటీ!
దిశ, జుక్కల్ : పెట్రోల్ బంకుల్లో పనిచేయడానికి ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు సిద్ధమవుతున్నారు. ఇన్నిరోజులు ఆర్టీసీకి చెందిన స్థలాల్లో ఉన్న పెట్రోల్ బంకులను ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇకమీదట వాటిని సొంతంగా నడిపేందుకు తెలంగాణ రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ సమాయత్తం అవుతోంది. అందుకోసం తమ సిబ్బందికి ముందస్తుగా శిక్షణా ఇప్పిస్తోంది. సోమవారం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో ఆర్టీసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పెట్రోల్ బంకులో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ట్రెయినింగ్ […]
దిశ, జుక్కల్ : పెట్రోల్ బంకుల్లో పనిచేయడానికి ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు సిద్ధమవుతున్నారు. ఇన్నిరోజులు ఆర్టీసీకి చెందిన స్థలాల్లో ఉన్న పెట్రోల్ బంకులను ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇకమీదట వాటిని సొంతంగా నడిపేందుకు తెలంగాణ రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ సమాయత్తం అవుతోంది. అందుకోసం తమ సిబ్బందికి ముందస్తుగా శిక్షణా ఇప్పిస్తోంది.
సోమవారం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో ఆర్టీసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పెట్రోల్ బంకులో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ట్రెయినింగ్ పొందుతున్నారు.ఈ విషయం పై డ్రైవర్, కండక్టర్లను వివరణ కోరగా వచ్చే ఆగస్టు నుంచి పూర్తిస్థాయిలో పెట్రోల్ బంకులో విధులు నిర్వర్తించాలంటూ ఆదేశాలు వచ్చాయని.. అందువల్లే ముందస్తుగా శిక్షణ పొందుతున్నామని తెలిపారు. తమ వద్ద ఏమీ లేదని, ఉన్నతాధికారులు ఏది చెప్తే అది చేయాల్సిందేనని వారి దీనావస్థను కనబరిచారు. ఆర్టీసీ డ్రైవర్లు బస్సులు నడపాలి.. కండక్టర్లు టిక్కెట్లు చించాలి కానీ, పెట్రోలు బంకులు పని చేస్తున్నారేంటని మండల ప్రజలు పలువిధాలుగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం అక్కడ హాట్ టాపిక్ గా మారింది. కామారెడ్డి జిల్లాలో ఆర్టీసీకి చెందిన రెండు పెట్రోల్ బంకులను యాజమాన్యం సొంతంగా నడిపేందుకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది.