IND Vs AUS: రెండో రోజు ముగిసిన ఆట.. మరోసారి కష్టాల్లో టీమిండియా

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా మెల్‌బోర్న్ (Melbourne) వేదిక‌గా జ‌రుగుతోన్న బాక్సింగ్ డే (Boxing Day) టెస్టు తొలి ఇన్నింగ్స్‌ భారత జట్టు కష్టాల్లో పడింది.

Update: 2024-12-27 08:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా మెల్‌బోర్న్ (Melbourne) వేదిక‌గా జ‌రుగుతోన్న బాక్సింగ్ డే (Boxing Day) టెస్టు తొలి ఇన్నింగ్స్‌ భారత జట్టు కష్టాల్లో పడింది. రెండు రోజుల ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (6), రవీంద్ర జడేజా (4) పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నారు. 6 వికెట్లు 311 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించిన కంగారు జట్టు 474 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు భారత జట్టు ఆచితూచి ఆడుతూ.. స్కోర్ బోర్డును ముుందుకు తీసుకెళ్లింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashaswi Jaiswal) (82) పరుగులతో అదగొట్టాడు. రనౌట్ అయి తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. కేఎల్ రాహుల్ (KL Rahul) (24), విరాట్ కోహ్లీ (Virat Kohli) (36) నెమ్మదిగా ఆడినప్పటికీ క్రీజ్‌లో నిలదొక్కుకోలేకపోయారు. అదేవిధంగా జట్టు సారథి రోహిత్ శర్మ (Rohith Sharma) మరోసారి నిరాశపరిచాడు. ఇక ఆసిస్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్ (Pat Commins) 2, స్కాట్ బోలాండ్ (స్కాట్ బోలాండ్) 2 వికెట్లు తీసున్నారు.

Tags:    

Similar News