‘సెలవు కావాలంటే నా కోరిక తీర్చాల్సిందే’

దిశ, వెబ్‌డెస్క్: మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ డిపో మేనేజర్ భాగోతం బయటపడింది. తన కంటికి ఎవరు అందంగా కనిపిస్తే వారిని కోరిక తీర్చాలంటున్న కామాంధుడి కర్కషత్వానికి బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మేనేజర్ హోదాలో ఉన్న మృగంపై చర్యలు తీసుకోవాల్సిందేనని కదం తొక్కుతున్నారు. సమాజంలో గౌరవంగా బతుకుతున్న నారీమణిలను ఆ డిపో మేనేజర్ కించపరుస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది శ్రీకాకుళం జిల్లా టెక్కలి […]

Update: 2020-07-31 05:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ డిపో మేనేజర్ భాగోతం బయటపడింది. తన కంటికి ఎవరు అందంగా కనిపిస్తే వారిని కోరిక తీర్చాలంటున్న కామాంధుడి కర్కషత్వానికి బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మేనేజర్ హోదాలో ఉన్న మృగంపై చర్యలు తీసుకోవాల్సిందేనని కదం తొక్కుతున్నారు. సమాజంలో గౌరవంగా బతుకుతున్న నారీమణిలను ఆ డిపో మేనేజర్ కించపరుస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది

శ్రీకాకుళం జిల్లా టెక్కలి డిపో మేనేజర్‌ ఈశ్వరరావు.. తన డిపోలో పని చేసే మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. ఒక్క రోజు సెలవు అడిగినందుకే కోరిక తీర్చామన్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్యూటీ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో తన క్యాబిన్‌కు రావాలని పిలుస్తున్నాడు. ఆ తర్వాత వారిని తన కోరిక తీర్చాలంటూ ఇబ్బంది పెడుతున్నాడు. వారి సెల్ నెంబర్లు తీసుకొని వాట్సాప్‌లో అసభ్య కరమైన సందేశాలు పంపుతున్నాడు. ప్రాణం కంటే మానానికే విలువనిచ్చే మహిళలు.. ఆ కామాంధుడి చేష్టలను కన్నీళ్లను దిగమింగుతూ డ్యూటీలు చేస్తున్నారు.

తన మాట వినని.. తన కోరిక తీర్చని ఉద్యోగులకు ప్రమోషన్ ఇవ్వనంటూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడంటే అతడు ఎంత రాక్షసంగా ప్రవర్తిస్తున్నాడో అర్థమవుతోంది. మహిళా ఉద్యోగులపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న అతడిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా తన కోరిక తీర్చిన వారికి లాంగ్ డ్రైవ్‌, టూరిస్ట్ ప్లేస్‌లకు తీసుకెళ్తానంటూ చిల్లర లెక్కలు చేశాడు. అతడి వేధింపులు భరించలేని ఓ బాధిత ఉద్యోగి డిపో మేనేజర్ ఈశ్వర రావు భాగోతం బట్టబయలు చేశారు. పదవిని అడ్డుపెట్టుకొని అడ్డమైన పనులు చేస్తున్న అతడిని విధుల్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News