పెద్దపల్లిలో ఘోర ప్రమాదం.. లోయలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

దిశ, మంథని: పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొని బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో కాన్సాయిపేటకు చెందిన బస్సు డ్రైవర్ తాటి వినీత్(22) అక్కడికక్కడే మృతిచెందగా, కండక్టర్ సహా ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటన జిల్లాలోని మంథని-కాటారం ప్రధాన రహదారి గాడుదల గండిగుట్ట వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఆర్టీసీ బస్సు బెల్లంపల్లి నుంచి హన్మకొండ […]

Update: 2021-10-05 21:54 GMT

దిశ, మంథని: పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొని బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో కాన్సాయిపేటకు చెందిన బస్సు డ్రైవర్ తాటి వినీత్(22) అక్కడికక్కడే మృతిచెందగా, కండక్టర్ సహా ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటన జిల్లాలోని మంథని-కాటారం ప్రధాన రహదారి గాడుదల గండిగుట్ట వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఆర్టీసీ బస్సు బెల్లంపల్లి నుంచి హన్మకొండ వైపు వెళ్తోన్న పరకాల డిపోకు చెందిన బస్సుగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం ఆరుగురు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News