ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నేత కన్నుమూత

నాగ్‌పూర్: ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నేత, తొలి అధికార ప్రతినిధి మహదేవ్ గోవింద్ వైద్య(97) శనివారం నాగ్‌పూర్‌లో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మధ్యాహ్నం 3.35గంటలకు ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆయన కన్ను మూశారని ఆయన మనవడు విష్ణు వైద్య చెప్పారు. ఇటీవల గోవింద్‌ వైద్యకు కరోనా సోకిందని, పూర్తిగా కోలుకున్నారని చెప్పారు. శుక్రవారం ఒక్కసారిగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్‌లో జాయిన్ చేసినట్లు విష్ణు వైద్య పేర్కొన్నారు.

Update: 2020-12-19 07:23 GMT

Tags:    

Similar News