RS ప్రవీణ్ కుమార్‌ తెరవెనుక పాలిటిక్స్.. లక్ష్యాన్ని ముందే చేరుకున్నారా..?

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ గురుకులాల సెక్రెటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన పదవికి నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇంకో ఆరేళ్ల సర్వీసు మిగిలి ఉండగానే వీఆర్ఎస్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే, ఆయన రాజకీయాల్లోకి వచ్చేందుకే వేగంగా తన నిర్ణయాన్ని ప్రకటించినట్లు తెలుస్తోంది. అప్పటికప్పుడు ప్రవీణ్ కుమార్ రాజీనామా నిర్ణయం తీసుకోలేదని, అందరితో సుదీర్ఘంగా చర్చించాకే వీఆర్ఎస్‌కు మొగ్గుచూపినట్లు అంతా భావిస్తున్నారు. అంతకుముందు బీఎస్పీ అధినేత్రి మాయావతితో శని, ఆదివారాల్లో వరుసగా భేటీలు నిర్వహించిన […]

Update: 2021-07-20 00:35 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ గురుకులాల సెక్రెటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన పదవికి నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇంకో ఆరేళ్ల సర్వీసు మిగిలి ఉండగానే వీఆర్ఎస్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే, ఆయన రాజకీయాల్లోకి వచ్చేందుకే వేగంగా తన నిర్ణయాన్ని ప్రకటించినట్లు తెలుస్తోంది. అప్పటికప్పుడు ప్రవీణ్ కుమార్ రాజీనామా నిర్ణయం తీసుకోలేదని, అందరితో సుదీర్ఘంగా చర్చించాకే వీఆర్ఎస్‌కు మొగ్గుచూపినట్లు అంతా భావిస్తున్నారు. అంతకుముందు బీఎస్పీ అధినేత్రి మాయావతితో శని, ఆదివారాల్లో వరుసగా భేటీలు నిర్వహించిన ఆయన.. పలుమార్లు మాసబ్ ట్యాంకులోని గురుకుల సొసైటీ కార్యాలయంలో వరుస భేటీలు జరిపారు.

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు కలిసి వారి మద్దతును కూడగట్టే ప్రయత్నాలు ఇంతకుముందే ప్రారంభించారు. భవిష్యత్ ప్రణాళికపై ముందుగానే చర్చించి పదవీ విరమణ ప్రకటించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెంట నడిచేందుకు వివిధ సంఘాలు ఇప్పటికే హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తన పదవి కారణంగా పేదలకు పూర్తి సేవలు అందించలేకపోతున్నట్లు, అందుకోసమే రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. అందుకోసం వడివడిగా అడుగులు వేస్తున్న ఆయన ముందుగా రాష్ట్రంలోని SC, ST ఉద్యోగుల మద్దతు కూడగట్టడంతో సఫలమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలోని స్వేరోలు కూడా ఆయన వెంట నడిచేందుకు సంసిద్ధత కనబరిచారు. పై అంశాలను పరిగణలోకి తీసుకుంటే ప్రత్యక్ష పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకే ముందుగా ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తెరవెనుక పాలిటిక్స్ నడిపారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

హుజురాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఆర్‌ఎస్ ప్రవీణ్‌ కుమార్..?

బిగ్ బ్రేకింగ్ : టీఆర్‌ఎస్‌లో కౌశిక్ రెడ్డి చేరికకు ముహూర్తం ఫిక్స్

Tags:    

Similar News