వైద్య రంగానికి రూ.6,186 కోట్ల కేటాయింపు

దిశ, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2020-21 వార్షిక బడ్జెట్ లో వైద్య రంగానికి రూ.6,186 కోట్లను కేటాయించింది. నిర్వహణ పద్దులో భాగంగా ఎంఎన్ జే ఆసుపత్రికి రూ.28 కోట్లు, నిమ్స్ కు రూ.113 కోట్లు, కాళోజి నారాయణ రావు ఆరోగ్య విశ్వ విద్యాలయానికి రూ.1.65 కోట్లు, ఉద్యోగుల, పెన్షనర్ల, జర్నలిస్టుల హెల్త్ స్కీం లకు రూ.410 కోట్లు కేటాయించారు. బోధనా ఆసుపత్రులకు రూ.342 కోట్లు, ప్రగతి పద్దుల కింద రూ.1893 కోట్లను కేటాయించారు. ఈ సందర్భంగా […]

Update: 2020-03-08 10:20 GMT

దిశ, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2020-21 వార్షిక బడ్జెట్ లో వైద్య రంగానికి రూ.6,186 కోట్లను కేటాయించింది. నిర్వహణ పద్దులో భాగంగా ఎంఎన్ జే ఆసుపత్రికి రూ.28 కోట్లు, నిమ్స్ కు రూ.113 కోట్లు, కాళోజి నారాయణ రావు ఆరోగ్య విశ్వ విద్యాలయానికి రూ.1.65 కోట్లు, ఉద్యోగుల, పెన్షనర్ల, జర్నలిస్టుల హెల్త్ స్కీం లకు రూ.410 కోట్లు కేటాయించారు. బోధనా ఆసుపత్రులకు రూ.342 కోట్లు, ప్రగతి పద్దుల కింద రూ.1893 కోట్లను కేటాయించారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగంలోమాట్లాడుతూ దేశంలో అత్యుత్తమ వైద్య సేవలు అందించడంలో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో నిలిచిన విషయాన్ని నీతి అయోగ్ ప్రశంసించినట్టు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో 22 శాతం ప్రసవాల శాతాన్ని పెరిగాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 ప్రభుత్వ ఆసుపత్రులలో డయాలసిస్ కేంద్రాలను, 20 ఐసీయూ కేంద్రాలను, గర్భిణీ స్త్రీలు ఆసుపత్రికి రావడానికి వీలుగా 200 అంబులెన్సులను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం నడుస్తున్న 118 బస్తీ దవాఖానాల ద్వారా పేదలకు వైద్య సేవలు అందుతున్నట్టు చెప్పారు. మరో 232 బస్తీ దవాఖాలను త్వరలోనే ప్రారంభించనున్నట్టు తెలిపారు.

Tags: Budget, Health, Medical and Family Welfare

Tags:    

Similar News