270 మంది మృతి.. ఆ కంపెనీకి రూ.51వేల కోట్ల జరిమానా!

దిశ, వెబ్‌డెస్క్ : బ్రెజిల్ దేశంలో రిజర్వాయర్ కూలిన ఘటనలో 270 మంది కార్మికులు మరణించారు. దీనిని సీరియస్‌‌గా తీసుకున్న అక్కడి ప్రభుత్వం ‘వేల్’ మైనింగ్ కంపెనీకి రూ.51వేల కోట్ల జరిమానా విధించింది. అందుకు బ్రెజిలియన్ కంపెనీ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. దీనిని లాటిన్ అమెరికా దేశాల్లోనే భారీ సెటిల్మెంట్ వ్యవహారంగా అభివర్ణిస్తున్నారు. అయితే, ఆ డ్యామ్‌ను పక్కనే గల ఐరన్ ఓర్ గని నుంచి వెలువడే టాక్సిక్ వ్యర్థాలను నిల్వ చేసేందుకు నిర్మించారు. అది కాస్త […]

Update: 2021-02-05 05:19 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బ్రెజిల్ దేశంలో రిజర్వాయర్ కూలిన ఘటనలో 270 మంది కార్మికులు మరణించారు. దీనిని సీరియస్‌‌గా తీసుకున్న అక్కడి ప్రభుత్వం ‘వేల్’ మైనింగ్ కంపెనీకి రూ.51వేల కోట్ల జరిమానా విధించింది. అందుకు బ్రెజిలియన్ కంపెనీ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. దీనిని లాటిన్ అమెరికా దేశాల్లోనే భారీ సెటిల్మెంట్ వ్యవహారంగా అభివర్ణిస్తున్నారు.

అయితే, ఆ డ్యామ్‌ను పక్కనే గల ఐరన్ ఓర్ గని నుంచి వెలువడే టాక్సిక్ వ్యర్థాలను నిల్వ చేసేందుకు నిర్మించారు. అది కాస్త బద్ధలవడంతో సుమారు 270 మందికి పైగా కార్మికులు మరణించినట్లు బ్రెజిల్ ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ఈ ఘటనలో మైనింగ్ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ హత్యా నేరారోపణలు ఎదుర్కొంటున్నారు.

Tags:    

Similar News