కొత్తగూడెంలో మరో భారీ స్కాం.. నిండా మునిగిన నిరుద్యోగులు
దిశ, కొత్తగూడెం : పారిశ్రామిక ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిరుద్యోగులు భారీగా ఉన్నారు. వీరి అవసరాన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది మోసగాళ్లు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ. లక్షలు వసూలు చేస్తున్నారు. గతవారం న్యాయస్థానాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక మాయ లేడి మాటలు నమ్మి సుమారు 100 మంది వరకు రూ. 1 కోటి 80 లక్షల చెల్లించి నట్టేట మునిగిన విషయం తెలిసిందే. తాజాగా కొత్తగూడెం బాబు క్యాంపునకు చెందిన పుచ్చకాయల సాంబశివరావు, కేటీపీఎస్ పవర్ […]
దిశ, కొత్తగూడెం : పారిశ్రామిక ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిరుద్యోగులు భారీగా ఉన్నారు. వీరి అవసరాన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది మోసగాళ్లు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ. లక్షలు వసూలు చేస్తున్నారు. గతవారం న్యాయస్థానాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక మాయ లేడి మాటలు నమ్మి సుమారు 100 మంది వరకు రూ. 1 కోటి 80 లక్షల చెల్లించి నట్టేట మునిగిన విషయం తెలిసిందే. తాజాగా కొత్తగూడెం బాబు క్యాంపునకు చెందిన పుచ్చకాయల సాంబశివరావు, కేటీపీఎస్ పవర్ ప్లాంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి ఏకంగా రెండు కోట్ల రూపాయలు చీటింగ్ చేశాడు.
డబ్బులు కట్టాక ఎంతకూ ఉద్యోగాలు రాకపోవడంతో మోసపోయామని భావించిన నిరుద్యోగులు చెల్లించిన డబ్బులు రాబట్టుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఓపిక నశించిన మరి కొంతమంది పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే, కొంతమంది దళారులు ఉన్నతస్థాయి అధికారులతో పరిచయాలు ఉన్నాయంటూ చెబుతూ.. నిరుద్యోగ యువతను మాయ మాటలతో నమ్మించి, డబ్బులు వసూలు చేసి పరారవుతున్నారు. ఇకమీదట అయిన ఇలాంటి దళారులను నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.