బీ కేర్ ఫుల్.. మాస్కు లేకపోతే బాదుడే..
దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కేసులు పెరుగుతుండటంపై దృష్టి సారించిన ప్రభుత్వాలు కొవిడ్ రూల్స్‌ను కఠినతరం చేశాయి. బయట సంచరించే ప్రతిఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని, శానిటైజర్ వినియోగించాలని స్పష్టంచేశారు. అయినప్పటికీ పౌరుల్లో ఎలాంటి మార్పు కనిపించడంలేదు. వ్యాక్సిన్ వచ్చింది అనే భరోసాతో ఎవరూ నిబంధనలు పాటించడం లేదని తెలుస్తోంది. దీంతో మాస్కు లేకుండా ఇతరుల ప్రాణాలను రిస్కులో పెట్టేవారిపై ఏపీ అధికారులు సృష్టిసారించారు. […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కేసులు పెరుగుతుండటంపై దృష్టి సారించిన ప్రభుత్వాలు కొవిడ్ రూల్స్‌ను కఠినతరం చేశాయి. బయట సంచరించే ప్రతిఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని, శానిటైజర్ వినియోగించాలని స్పష్టంచేశారు.
అయినప్పటికీ పౌరుల్లో ఎలాంటి మార్పు కనిపించడంలేదు. వ్యాక్సిన్ వచ్చింది అనే భరోసాతో ఎవరూ నిబంధనలు పాటించడం లేదని తెలుస్తోంది. దీంతో మాస్కు లేకుండా ఇతరుల ప్రాణాలను రిస్కులో పెట్టేవారిపై ఏపీ అధికారులు సృష్టిసారించారు. మాస్కులేకుండా కనిపిస్తే జరిమానాలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో నిన్న మాస్కులు లేకుండా తిరిగే వారికి రూ.250 ఫైన్ వేశారు. ఇలా కొవిడ్ రూల్స్ పాటించని వారి నుంచి ఒక్కరోజులోనే రూ.17.34లక్షలు జరిమానాలు వసూలయ్యాయి.అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2,327 మందికి ఫైన్లు వేశారు.