హెయిర్ కటింగ్ అలా చేసినందుకు రూ.2కోట్లు ఫైన్..

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రతి ఒక్కరూ తమ అందాన్ని రెట్టింపు చేసుకునేందుకు పార్లర్ కి వెలుతుంటారు. మోడ్రన్ హెయిర్ కటింగ్ చేసుకొని అందరిలో స్పెషల్‌గా కనిపించాలనుకుంటారు. కానీ అలా కొందరికే సాధ్యం. సెలూన్‌లో హెయిర్ కట్ చేసి, అందంగా తయారు చేసి.. పంపించినా.. బయటకొచ్చి చూశాక తెలుస్తుంది అంత తూచ్ అని. కానీ ఎవరూ అది పట్టించుకోరు.. నెక్స్ట్ టైం ట్రై చేద్దామని వెళ్లిపోతుంటారు. కానీ ఢిల్లీ‌కి చెందిన ఓ మహిళ హెయిర్ కట్ సరిగా […]

Update: 2021-09-23 22:13 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రతి ఒక్కరూ తమ అందాన్ని రెట్టింపు చేసుకునేందుకు పార్లర్ కి వెలుతుంటారు. మోడ్రన్ హెయిర్ కటింగ్ చేసుకొని అందరిలో స్పెషల్‌గా కనిపించాలనుకుంటారు. కానీ అలా కొందరికే సాధ్యం. సెలూన్‌లో హెయిర్ కట్ చేసి, అందంగా తయారు చేసి.. పంపించినా.. బయటకొచ్చి చూశాక తెలుస్తుంది అంత తూచ్ అని. కానీ ఎవరూ అది పట్టించుకోరు.. నెక్స్ట్ టైం ట్రై చేద్దామని వెళ్లిపోతుంటారు. కానీ ఢిల్లీ‌కి చెందిన ఓ మహిళ హెయిర్ కట్ సరిగా చేయలేదని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (NCDRC)ని ఆశ్రయించారు.

ఫిర్యాదుదారైన ‘అషనా రాయ్‌’ తనకున్న పొడవైన కేశాల కారణంగా పలు హెయిర్ ప్రాడక్ట్స్‌కి మోడల్‌గా ఉన్నానని, అనేక పెద్ద బ్రాండ్‌లకూ పనిచేశానని కమిషన్‌‌కు పేర్కొన్నారు. సూచనలకు విరుద్ధంగా హెయిర్ కట్ చేయడం వల్ల అవకాశాలు దూరమయ్యాయని, అత్యున్నత మోడల్‌ కావాలన్న కల నాశనమైందని కమిషన్‌కు ఆమె తెలిపారు. దీనిపై సమీక్షించిన కమిషన్.. మహిళకు హెయిర్ కట్‌ తప్పుగా చేయడంతో పాటు ఆమె కేశాలకు తప్పుడు చికిత్స చేసినందుకు రూ.2 కోట్లు పరిహారంగా చెల్లించాలంటూ దిల్లీలోని ఓ సంస్థ కి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా మహిళలకు కేశ సంపదతో భావోద్వేగపరమైన అనుబంధం ఉంటుందని పేర్కొన్నారు. సిబ్బంది పొరపాటు కారణంగా ఆమె నెత్తి కాలిపోయిందని, ఇప్పటికీ దురద, అలెర్జీతో బాధపడుతున్నారని కమిషన్ వ్యాఖ్యానించింది.

 

Tags:    

Similar News