ఈవీ మార్కెట్ లక్ష్యానికి భారీ పెట్టుబడి అవసరం

దిశ, వెబ్‌డెస్క్: 2030 నాటికి భారత్ తన ఎలక్ట్రిక్ వాహనాల లక్ష్యాలను సాధించాలంటే వాహనాల ఉత్పత్తికి, మౌలిక సదుపాయాల కోసం దాదాపు రూ. 12.5 లక్షల కోట్లను పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని ఓ అధ్యయనం తెలిపింది. ఆ సమయానికి రోడ్లపై 10 కోట్ల ఎలక్ట్రిక్ వాహనాలు ఉండొచ్చని, రాబోయే దశాబ్దంలో అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయగలిగితే అప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ విలువ రూ. 14.2 లక్షల కోట్లు ఉంటుందని ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్(సీఈడబ్ల్యూ)కి చెందిన […]

Update: 2020-12-08 07:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2030 నాటికి భారత్ తన ఎలక్ట్రిక్ వాహనాల లక్ష్యాలను సాధించాలంటే వాహనాల ఉత్పత్తికి, మౌలిక సదుపాయాల కోసం దాదాపు రూ. 12.5 లక్షల కోట్లను పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని ఓ అధ్యయనం తెలిపింది. ఆ సమయానికి రోడ్లపై 10 కోట్ల ఎలక్ట్రిక్ వాహనాలు ఉండొచ్చని, రాబోయే దశాబ్దంలో అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయగలిగితే అప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ విలువ రూ. 14.2 లక్షల కోట్లు ఉంటుందని ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్(సీఈడబ్ల్యూ)కి చెందిన సెంటర్ ఫర్ ఎనర్జీ ఫైనాన్స్ అధ్యయనం వెల్లడించింది.

2030 నాటికి మొత్తం వాహనాల్లో 70 శాతం కమర్షియల్, ప్రైవేట్ కార్లు 30 శాతం, బస్సులు 40 శాతం, టూ-వీలర్, త్రీ-వీలర్ వాహనాలు 80 శాతం వరకు అమ్మకాలు ఉండొచ్చని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. ఇన్-హోమ్ ఛార్జింగ్ పాయింట్లతో పాటు 2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి భారత్‌లో 29 లక్షల పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్ల నెట్‌వర్క్ అవసరం, ప్రస్తుతం ఇవి 1800 మాత్రమే ఉన్నాయి. దీనికోసం రాబోయే దశాబ్ద కాలంలో అదనంగా రూ. 20,600 కోట్ల పెట్టుబడులు అవసరమని సీఈడబ్ల్యూ సీనియర్ అనలిస్ట్ వైభవ్ ప్రతాప్ సింగ్ తెలిపారు.

Tags:    

Similar News