కార్మికులకు సంక్షేమ బోర్డు నిధులివ్వాలి
దిశ, న్యూస్‌బ్యూరో:లాక్‌డౌన్ నేపథ్యంలో భవన నిర్మాణ రంగంలో ఉపాధి కోల్పొయిన కార్మికులకు సంక్షేమ బోర్డు నుంచి ప్రతి కుటుంబానికీ రూ.10వేల ఆర్థిక సాయం అందించాలని అఖిపక్షం డిమాండ్ చేసింది. దీనిపై మంగళవారం లేబర్ కమిషన్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్షలాది మంది కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడ్డారన్నారు. నిర్మాణ రంగంలో పనిచేస్తూ, బోర్డులో పేరు నమోదు చేసుకున్నవారు 15లక్షల మంది ఉన్నట్టు ప్రభుత్వ […]
దిశ, న్యూస్‌బ్యూరో:లాక్‌డౌన్ నేపథ్యంలో భవన నిర్మాణ రంగంలో ఉపాధి కోల్పొయిన కార్మికులకు సంక్షేమ బోర్డు నుంచి ప్రతి కుటుంబానికీ రూ.10వేల ఆర్థిక సాయం అందించాలని అఖిపక్షం డిమాండ్ చేసింది. దీనిపై మంగళవారం లేబర్ కమిషన్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ..
రాష్ట్రంలో లక్షలాది మంది కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడ్డారన్నారు. నిర్మాణ రంగంలో పనిచేస్తూ, బోర్డులో పేరు నమోదు చేసుకున్నవారు 15లక్షల మంది ఉన్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయని వివరించారు. కేంద్ర కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి లాక్‌డౌన్‌లో పనులు కోల్పొయిన నిర్మాణ రంగ కార్మికులకు వారి సంక్షేమ బోర్డు నుంచి ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసిందనే విషయాన్ని గుర్తుచేశారు.కానీ రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ అమలులోకి వచ్చి 50 రోజులు గడుస్తున్నా, నేటికీ కార్మికులకు ఎలాంటి ఆర్థిక సాయం అందజేయలేదని మండిపడ్డారు. కేరళ, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు కార్మికులకు ఆర్థిక సాయం కింద ప్రతి కుటుంబానికి రూ.5 వేల అందజేస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సంక్షేమబోర్డు నిధులు రూ.330 కోట్లను బోర్డు సభ్యులుగా ఉన్నవారికి రూ.10 వేల చొప్పున అందించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీజెఎస్ ఆధ్యక్షుడు కోదండరాం, టీడీజీ ఆధ్యక్షుడు రమణ, కాంగ్రెస్ నాయకులు రాములునాయక్ తదితరులు పాల్గొన్నారు.