పూరి గుడిసెలో దాచిన రూ. 10 లక్షలు అగ్నికి ఆహుతి

దిశ, వెబ్‌డెస్క్: భూమి విక్రయించగా వచ్చిన నగదును పూరి గుడిసెలోని బీరువాలో దాచి పెట్టగా ప్రమాదవశాత్తు నిప్పంటుకుని కాలిపోయాయి. ఈ సంఘటన మునగాల మండల పరిధిలోని నేలమర్రి గ్రామంలో గురువారం చోటుచేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కప్పల లక్ష్మయ్య చిన్నకారు రైతు. తనకి ఉన్న రెండెకరాలను సేద్యం చేస్తూ గ్రామంలో కూలీ పనులకు వెళ్తూ ఉంటాడు. లక్ష్మయ్యకి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారసత్వంగా వచ్చిన ఉమ్మడి ఆస్తిని విక్రయించగా.. గత నాలుగు […]

Update: 2021-10-21 09:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: భూమి విక్రయించగా వచ్చిన నగదును పూరి గుడిసెలోని బీరువాలో దాచి పెట్టగా ప్రమాదవశాత్తు నిప్పంటుకుని కాలిపోయాయి. ఈ సంఘటన మునగాల మండల పరిధిలోని నేలమర్రి గ్రామంలో గురువారం చోటుచేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కప్పల లక్ష్మయ్య చిన్నకారు రైతు. తనకి ఉన్న రెండెకరాలను సేద్యం చేస్తూ గ్రామంలో కూలీ పనులకు వెళ్తూ ఉంటాడు. లక్ష్మయ్యకి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారసత్వంగా వచ్చిన ఉమ్మడి ఆస్తిని విక్రయించగా.. గత నాలుగు రోజుల క్రితం రూ.10 లక్షలు వచ్చాయి. దీంతో ఆ డబ్బును ఇంటిలోని(పూరి గుడిసె) బీరువాలో భద్రపరిచాడు.

ఆ నగదుతో భూమి కొనాలా, ఇల్లు నిర్మించాలా అనే ఆలోచనలో ఉన్నాడు. కానీ, అతడి ఆశలను అగ్నిప్రమాదం మసి చేసింది. గురువారం రోజు మాదిరిగానే వ్యవసాయ పొలానికి పనులు నిర్వహించేందుకు వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సాయంత్రం వేళ నిప్పు అంటుకుని మంటలు చెలరేగాయి. మంటలను చుట్టుపక్కల వారు గుర్తించి లక్ష్మయ్యకి కబురు చేసి మంటలను ఆర్పారు. అనంతరం గుడిసె‌లో పరిశీలించగా ఫర్నీచర్‌తో పాటు బీరువాలో దాచిన నగదు దగ్ధం అయినట్లు గుర్తించారు. దీంతో బాధితుడు లబోదిబోమన్నాడు. ప్రభుత్వం స్పందించి లక్ష్మయ్యకు ఆర్థిక సహాయం అందజేయాలని స్థానికులు కోరుతున్నారు.

Tags:    

Similar News