సత్తా చాటిన సిరాజ్.. తోక ముడిచిన కోల్‌కతా

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 39వ మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యంతో బరిలోకి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించారు. 13.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. దీంతో 8 వికెట్ల భారీ తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్ ను చిత్తు చేసింది. కోల్ కతా బ్యాట్స్‌మెన్లు దారుణంగా విఫలం అవడంతో కేవలం 84 పరుగులు మాత్రమే చేయగలిగిన విషయం తెలిసిందే. ఇంతటి స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించడంతోనే బెంగళూరు అవలీలగా విజయం సాధించగా.. కోల్‌కతా […]

Update: 2020-10-21 11:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 39వ మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యంతో బరిలోకి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించారు. 13.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. దీంతో 8 వికెట్ల భారీ తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్ ను చిత్తు చేసింది. కోల్ కతా బ్యాట్స్‌మెన్లు దారుణంగా విఫలం అవడంతో కేవలం 84 పరుగులు మాత్రమే చేయగలిగిన విషయం తెలిసిందే. ఇంతటి స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించడంతోనే బెంగళూరు అవలీలగా విజయం సాధించగా.. కోల్‌కతా చిత్తు చిత్తుగా ఓడింది.

బెంగళూరు ఇన్నింగ్స్:

తొలుత బ్యాటింగ్ దిగిన దేవదత్‌ పడిక్కల్‌ (25), ఆరోన్ ఫించ్ (16) పరుగులు చేసి వెనుదిరిగిన ఛేదించాల్సిన స్కోరు స్వల్పంగా ఉంది. దీంతో వన్‌డౌన్‌లో వచ్చిన గురుకీరత్ సింగ్ (21), కోహ్లీ (18) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. దీంతో 13.3వ ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేశారు. దీంతో బెంగళూరు విజయం లాంఛనం అయింది.

కోల్‌కతా ఇన్నింగ్స్:

ఐపీఎల్ 39వ మ్యాచ్‌లో బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్‌ ఐపీఎల్ చరిత్రలో రెండోసారి చెత్త రికార్డును నెలకొల్పింది. 2008లో ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో 67/10 పరుగుల చెత్త రికార్డును నెలకొల్పిన కోల్‌కతా సరిగ్గా 12 సంవత్సరాల తర్వాత మరో చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 84 పరుగులకే పరిమితమైంది. ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు ఒక్క పరుగు మాత్రమే చేయడంతో కోల్‌కతా అతి స్వల్ప స్కోరును చవిచూసింది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఓపెనర్, వన్‌డౌన్ ఆటగాళ్లకు బెంగళూరు బౌలర్లు చుక్కలు చూపించారు. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా వికెట్లు తీయడం మొదలుపెట్టారు. దీంతో కోల్‌కతా తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఈ నేపథ్యంలోనే తొలి వికెట్ రాహుల్ త్రిపాఠితోనే మొదలైంది. 3 పరుగుల వద్ద రెండో ఓవర్ వేస్తున్న మహ్మద్ సిరాజ్ రాహుల్ త్రిపాఠి(1) క్యాచ్ అవుట్ చేశాడు. ఆ తర్వాతి బంతికే నితీష్ రానా‌ను (0)డకౌట్ చేశాడు. వీరిద్దరి వికెట్ కోల్పోయిన తర్వాతి ఓవర్‌ నవదీప్ సైని వేశాడు. ఈ ఓవర్‌ రెండో బంతికే శుబ్ మన్‌ గిల్ కూడా(1) అవుట్ అయ్యాడు. దీంతో కేవలం 3 పరుగులకే కోల్‌కతా 3 వికెట్లు కోల్పోయి ఊహించని ఊబిలో పడింది.

ఇక మిడిలార్డర్‌లో వచ్చిన టామ్ బెంటన్(10), దినేష్ కార్తీక్(4), ప్యాట్ కమ్మిన్స్(4) పరుగులకే వికెట్లను సమర్పించారు. దీంతో 6 వికెట్ల నష్టానికి కోల్‌కతా కేవలం 40 పరుగులే చేసింది. ఇక 5వ స్థానంలో వచ్చిన కెప్టెన్ మోర్గాన్ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లే ప్రయంత్నం చేశాడు. కానీ అది ఫలించలేదు. బౌలర్లు పోటీ పడుతూ మేడ్ ఇన్ ఓవర్లు.. వికెట్లు తీయసాగారు. ఈ తరుణంలోనే మోర్గాన్‌(30) కూడా 57 పరుగుల వద్ద క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన కుల్దీప్ యాదవ్ (12), లాకి ఫెర్గూసన్(19*) నాటౌట్‌గా నిలిచాడు. బ్యాట్స్‌మెన్ల విఫలంతో నిర్ణీత 20 ఓవర్లలో కోల్‌కతా స్కోర్ మాత్రం 84 పరుగుల వద్ద ఆగిపోయింది.

కోల్‌కతాకు సినిమా చూపించిన సిరాజ్:

బెంగళూరు-కోల్‌కతా మ్యాచ్‌లో హైదరాబాద్ టోలీచౌకికి చెందిన మహ్మద్ సిరాజ్ ఐపీఎల్‌ చరిత్రలోనే నూతన రికార్డుకు నాంది పలికాడు. మొత్తం నాలుగు ఓవర్లు వేసిన మహ్మద్ సిరాజ్.. మొదటి పరుగు ఇచ్చే ముందు ఏకంగా 3 వికెట్లు తీశాడు. ఇదే సమయంలో కంటిన్యూగా రెండు మేడ్ ఇన్ ఓవర్లు(12 డాట్ బాళ్లు) వేశాడు. దీనికి తోడు 4 ఓవర్లలో మొత్తం 8 పరుగులు మాత్రమే ఇచ్చి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. దీంతో ఇదే మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్‌కు గేమ్ ఆఫ్ ది చేంజర్ అవార్డుతో పాటు.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ను కూడా అందుకున్నాడు. క్రెడ్ పవర్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు కూడా అందుకున్నాడు.

ఇతనికి తోడు వాషింగ్గన్ సుందర్ కూడా మంచి బౌలింగ్ కనబరిచాడు. 4 ఓవర్లు వేసి కేవలం 14 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఇదే మ్యాచ్‌లో యూజువేంద్ర చాహల్ సైతం మాయ చేశాడు. 4 ఓవర్లు వేసిన చాహల్ 15 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. బౌలర్లు చక్కగా రాణించడంతో కోల్‌కతా 84 పరుగులకే తోకముడిచింది. కాగా, ఒకే ఇన్నింగ్స్‌లో బెంగళూరు బౌలర్లు నాలుగు మేడ్ ఇన్ ఓవర్లు ఇవ్వడం కూడా ఇదే తొలిసారి కావడం గమనార్హం.

స్కోరు బోర్డు:

Kolkata Knight Riders Innings84-8 (20 Ov)

1. శుబ్‌మన్ గిల్ c క్రిస్ మోరిస్ b నవదీప్ సైని 1(6)
2. రాహుల్ త్రిపాఠి c డివిలియర్స్ b సిరాజ్ 1(5)
3. నితీష్ రానా b సిరాజ్ 0(1)
4. టామ్ బెంటన్ c డివిలియర్స్ b సిరాజ్ 1(0)
5.దినేశ్ కార్తీక్ (wk)lbw b చాహల్ 4(14)
6. ఇయాన్ మోర్గాన్ (c)c గురుకీరత్ సింగ్ b వాషింగ్టన్ సుందర్ 30(34)
7. ప్యాట్ కమ్మిన్స్ c పడిక్కల్ b చాహల్ 4(17)
8. కుల్దీప్ యాదవ్ నాటౌట్ రనౌట్ (గురుకీరత్ సింగ్ /క్రిస్ మోరిస్)12(19)
9. లాకి ఫెర్గూసన్ నాటౌట్ నాటౌట్ 19(16)

ఎక్స్‌ట్రాలు: 3

మొత్తం స్కోరు: 84-5

వికెట్ల పతనం: 3-1 ( రాహుల్ త్రిపాఠి, 1.3), 3-2 (నితీష్ రానా, 1.4), 3-3 (శుబ్‌మన్ గిల్, 2.2), 14-4 (టామ్ బెంటన్, 3.3), 32-5 (దినేశ్ కార్తీక్ , 8.4), 40-6 (ప్యాట్ కమ్మిన్స్, 12.3), 57-7 (ఇయాన్ మోర్గాన్, 15.4), 84-8 (కుల్దీప్ యాదవ్, 20)

బౌలింగ్:

1. క్రిస్ మోరిస్ 4-1-16-0
మహ్మద్ సిరాజ్ 4-2-8-3
నవదీప్ సైని 3-0-23-1
ఇసురు ఉదాన 1-0-6-0
యూజువేంద్ర చాహల్ 4-0-15-2
వాషింగ్టన్ సుందర్ 4-1-14-1

Royal Challengers Bangalore Innings85-2 (13.3 Ov)

1. దేవదత్ పడిక్కల్ రనౌట్ (కమ్మిన్స్ ) 25(17)
2. ఆరోన్ ఫించ్ c కార్తీక్ b లాకి ఫెర్గూసన్ 16 (21)
3. గురుకీరత్ సింగ్ నాటౌట్ 21(26
4. విరాట్ కోహ్లీ 18(17)

ఎక్స్‌ట్రాలు: 3

మొత్తం స్కోరు: 85-2

వికెట్ల పతనం: 46-1 (ఆరోన్ ఫించ్, 6.2), 46-2 (దేవదత్ పడిక్కల్, 6.4)

బౌలింగ్:

1. ప్యాట్ కమ్మిన్స్ 3-0-18-0
2. ప్రసీద్ కృష్ణ 2.3-0-20-0
3.వరుణ్ చక్రవర్తి 4-0-28-0
4. లాకీ ఫెర్గూసన్ 4-0-17-1

పాయింట్ టేబుల్

Tags:    

Similar News