రాయల్ బెంగాల్ టైగర్‌ను చంపిన అటవీ శాఖ సిబ్బంది.. ఎందుకో తెలుసా.?

దిశ, వెబ్‌డెస్క్ : రాయల్ బెంగాల్ టైగర్‌ను అటవీ శాఖ సిబ్బంది తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటన అసోంలోని కజీరంగా నేషనల్ పార్క్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఈ నెల 18న పార్క్ ​సమీప ప్రాంతమైన జపోరిపాథర్‌లో మృతిచెందిన రాయల్ బెంగాల్ టైగర్​ కళేబరాన్ని అటవీశాఖ ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం టైగర్ మృతిచెందడంపై విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అసలు విషయం బయటకు వచ్చింది. స్థానికంగా ఉన్న గ్రామాల్లో బెంగాల్ టైగర్.. పశువులపై దాడి […]

Update: 2021-06-29 02:41 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రాయల్ బెంగాల్ టైగర్‌ను అటవీ శాఖ సిబ్బంది తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటన అసోంలోని కజీరంగా నేషనల్ పార్క్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఈ నెల 18న పార్క్ ​సమీప ప్రాంతమైన జపోరిపాథర్‌లో మృతిచెందిన రాయల్ బెంగాల్ టైగర్​ కళేబరాన్ని అటవీశాఖ ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం టైగర్ మృతిచెందడంపై విచారణ చేపట్టారు.

ఈ క్రమంలో అసలు విషయం బయటకు వచ్చింది. స్థానికంగా ఉన్న గ్రామాల్లో బెంగాల్ టైగర్.. పశువులపై దాడి చేస్తోంది. ఈ క్రమంలో పులిని, అటవీ శాఖ సిబ్బంది జనావాసాల్లోకి రాకుండా చేయడానికి ప్రయత్నించారు. పులిని తుపాకీతో భయపెట్టాలని చూశారు. ఈ సందర్భంలో గన్ మిస్ ఫైర్ అయి బుల్లెట్.. బెంగాల్ టైగర్‌కు తగిలింది. దీంతో, పులి అక్కడిక్కడే మృతి చెందినట్టు కజిరంగా పార్క్ డైరెక్టర్ శివకుమార్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో బెంగాల్ టైగర్‌ను చంపిన అటవీ శాఖ సిబ్బందిని ఉన్నతాధికారులు విధులు నుంచి తొలగించారు.

 

Tags:    

Similar News