‘రోహిత్ ఫిట్‌గా లేడు.. అందుకే తీసుకోలేదు’
దిశ, స్పోర్ట్స్ : పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయకపోవడంపై పెద్ద దుమారం రేగింది. గాయం అనే సాకుతో రోహిత్‌పై కుట్ర చేశారని అభిమానులు సోషల్ మీడియాలో విమర్శలు కురిపించారు. మయాంక్ అగర్వాల్, నవదీప్ సైని కూడా గాయాల పాలైనా వారిని ఎలా ఎంపిక చేశారని.. రోహిత్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నా ఎందుకు దూరం పెట్టారని ప్రశ్నించారు. కాగా, దీనిపై బీసీసీఐ స్పష్టతనిచ్చింది. రోహిత్ శర్మ ప్రస్తుతం ఫిట్‌గా లేడని.. […]
దిశ, స్పోర్ట్స్ : పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయకపోవడంపై పెద్ద దుమారం రేగింది. గాయం అనే సాకుతో రోహిత్‌పై కుట్ర చేశారని అభిమానులు సోషల్ మీడియాలో విమర్శలు కురిపించారు. మయాంక్ అగర్వాల్, నవదీప్ సైని కూడా గాయాల పాలైనా వారిని ఎలా ఎంపిక చేశారని.. రోహిత్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నా ఎందుకు దూరం పెట్టారని ప్రశ్నించారు. కాగా, దీనిపై బీసీసీఐ స్పష్టతనిచ్చింది. రోహిత్ శర్మ ప్రస్తుతం ఫిట్‌గా లేడని.. అతడి ప్రాక్టీస్ వీడియో ఫేక్ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ముంబయి ఇండియన్స్ విడుదల చేసిన ఆ వీడియో నిజం కాకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. హామ్ స్ట్రింగ్ టియర్ గ్రేడ్ వన్ గాయమైతే కనీసం 6 వారాల సమయం పడుతుంది. గ్రేడ్2 గాయమైతే 8 వారాల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే రోహిత్ శర్మకు ఎలాంటి గాయం అయ్యిందనే విషయంపై స్పష్టత లేదు.