అవన్నీ నాకు అనవసరం.. బిగ్ బాంబ్ పేల్చిన కెప్టెన్‌ రోహిత్ శర్మ

దిశ, వెబ్‌డెస్క్ : భారత క్రికెట్ జట్టులో వారం రోజులుగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వన్డే, టీ20 జట్టుకు హిట్ మ్యాన్ రోహిత్ శర్మను కెప్టెన్‌ను చేస్తూ బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ అభిమానులు రచ్చ రచ్చ చేయడంతో ఏకంగా బీసీసీఐ బాస్ గంగూలీ.. విరాట్‌ను ఎందుకు తప్పించాల్సి వచ్చిందో క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. బీసీసీఐ నిర్ణయంపై పలువురు సీనియర్ క్రికెటర్లు సైతం పలు కీలక కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా వన్డే […]

Update: 2021-12-12 21:35 GMT

దిశ, వెబ్‌డెస్క్ : భారత క్రికెట్ జట్టులో వారం రోజులుగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వన్డే, టీ20 జట్టుకు హిట్ మ్యాన్ రోహిత్ శర్మను కెప్టెన్‌ను చేస్తూ బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ అభిమానులు రచ్చ రచ్చ చేయడంతో ఏకంగా బీసీసీఐ బాస్ గంగూలీ.. విరాట్‌ను ఎందుకు తప్పించాల్సి వచ్చిందో క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. బీసీసీఐ నిర్ణయంపై పలువురు సీనియర్ క్రికెటర్లు సైతం పలు కీలక కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా వన్డే జట్టు కెప్టెన్‌ అయిన తర్వాత మొదటిసారిగా రోహిత్ శర్మ స్పందించాడు.

ఈ సందర్భంగా హిట్ మ్యాన్ మాట్లాడుతూ.. టీమిండియా కెప్టెన్‌పై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. జట్టు గెలిస్తే భారత క్రికెట్ ఫ్యాన్స్ పాజిటివ్‌గా తీసుకుంటారు.. ఓడితే వారే నెగిటివ్‌గా తీసుకుంటారని అన్నాడు. ఇది ఎప్పుడూ ఉండేదేనని చెప్పుకొచ్చాడు. కానీ, ఓ క్రికెటర్‌గా ఇవన్నీ పట్టించుకోను.. నా ఆటపైనే దృష్టి పెడతాను. ఇది నేను కెప్టెన్‌గా చెప్పట్లేదు ఓ ప్లేయర్​గానే చెబుతున్నానంటూ క్లారిటీ ఇచ్చాడు. టీమిండియా ప్రధాన హెడ్ కోచ్ రాహుల్​ద్రవిడ్ ఆటగాళ్లలో బంధాన్ని మరింత పెంచేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నాడు. ప్రస్తుతం జట్టు ఫోకస్ మొత్తం దక్షిణాఫ్రికా టూర్‌పైనే ఉందని తెలిపాడు.

వారే కావాలని కోహ్లీని బలిపశువును చేస్తున్నారా..?

 

Tags:    

Similar News