24 మంది రోహింగ్యాలు అరెస్ట్
దిశ, వెబ్‌డెస్క్ : మయన్మార్ నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన రోహింగ్యాలను పోలీసులు అరెస్టు చేశారు. అస్సాంలోని హైలికాండి జిల్లాలో ఓ ఇంటిలో అక్రమంగా ఆశ్రమం పొందిన ఎనిమిది మంది రోహింగ్యాలను అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి పబీంద్ర కుమార్ నాథ్ తెలిపారు. ఇంటి యజమాని యూసుఫ్ అలీ మజుందార్ పరారీలో ఉండగా, సోదరుడు ఇస్లాముద్దీన్ మజుందార్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో 14 మంది మయన్మారీ శరణార్థులను పశ్చిమ బెంగాల్ లోని న్యూ జల్పాయిగురిలో అదుపులోకి […]
దిశ, వెబ్‌డెస్క్ : మయన్మార్ నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన రోహింగ్యాలను పోలీసులు అరెస్టు చేశారు. అస్సాంలోని హైలికాండి జిల్లాలో ఓ ఇంటిలో అక్రమంగా ఆశ్రమం పొందిన ఎనిమిది మంది రోహింగ్యాలను అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి పబీంద్ర కుమార్ నాథ్ తెలిపారు. ఇంటి యజమాని యూసుఫ్ అలీ మజుందార్ పరారీలో ఉండగా, సోదరుడు ఇస్లాముద్దీన్ మజుందార్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో 14 మంది మయన్మారీ శరణార్థులను పశ్చిమ బెంగాల్ లోని న్యూ జల్పాయిగురిలో అదుపులోకి తీసుకున్నారు. వారు బంగ్లాదేశ్ లోని కాక్స్ బజార్ నుండి పారిపోయి నవంబర్ 26 న భారతదేశంలోకి ప్రవేశించారు.
న్యూ జల్పాయిగురిలో బుధవారం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పిఎఫ్, ప్రభుత్వ రైల్వే పోలీసు (జిఆర్పి) తనిఖీలు చేపట్టగా 14 మంది మయన్మారీ రోహింగ్యా శరణార్థులు తరసపడ్డారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వీరంతా బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్‌లోని శరణార్థి శిబిరాల నుంచి పారిపోయి భారతదేశంలోకి ప్రవేశించినట్లు తేలిందని “ఈశాన్య సరిహద్దు రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సుభానన్ చందా తెలిపారు.