రన్నింగ్ బస్సుపై విరిగిపడిన కొండచరియలు.. ముగ్గురు మృతి..!

దిశ, వెబ్‌డెస్క్ : హిమాచల్ ప్రదేశ్‌లో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో అటుగా వస్తు్న్న బస్సుపై కొండచరియల శిథిలాలు కింద పడిపోవడంతో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందిగా, పలువురికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. క్షేమంగా బయట పడిన డ్రైవర్.. మరో 25 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్టు అధికారులకు వివరించారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది 10 మందిని సురక్షితంగా రక్షించారు. హిమాచల్ రాజధాని సిమ్లాకు 163కిలో మీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. […]

Update: 2021-08-11 07:15 GMT

దిశ, వెబ్‌డెస్క్ : హిమాచల్ ప్రదేశ్‌లో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో అటుగా వస్తు్న్న బస్సుపై కొండచరియల శిథిలాలు కింద పడిపోవడంతో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందిగా, పలువురికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. క్షేమంగా బయట పడిన డ్రైవర్.. మరో 25 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్టు అధికారులకు వివరించారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది 10 మందిని సురక్షితంగా రక్షించారు.

హిమాచల్ రాజధాని సిమ్లాకు 163కిలో మీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌కు కాల్ చేశారు. ఐటీబీపీ డీజీతోనూ మాట్లాడిన అమిత్ షా సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. హిమాచల్‌ ప్రదేశ్‌‌లో విరిగిపడిన కొండచరియల కింద మరో 40 మంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది. అక్కడ కురుస్తున్న వర్షాల ధాటికి సరిగ్గా రికాంగ్ పియో- సిమ్లా హైవేపై కొండచరియలు విరిగిపడటంతో ఈ దారుణం చోటుచేసుకున్నదని అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News