యూపీలో రోడ్డు ప్రమాదం.. 17 మంది దుర్మరణం

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న జేసీబీని హై స్పీడ్‌లో వెళ్తున్న యూపీ రోడ్‌వేస్‌కు చెందిన శతాబ్ది ఏసీ బస్సు ఢీకొట్టింది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ దుర్ఘటనలో 17 మంది మరణించారు. 24 మందికి గాయాలైనట్టు తెలిసింది. ఇందులో ఇద్దరి పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్టు సమాచారం. బస్సు చాలా వేగంగా ఢీకొట్టడంతో బస్సులోని అందరికీ తీవ్రగాయాలయ్యాయి. కాన్పూర్ నుంచి అహ్మదాబాద్ వెళ్తున్న ఏసీ బస్సు సచేందీ సమీపంలో జేసీబీని ఢీకొట్టింది. […]

Update: 2021-06-08 21:42 GMT

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న జేసీబీని హై స్పీడ్‌లో వెళ్తున్న యూపీ రోడ్‌వేస్‌కు చెందిన శతాబ్ది ఏసీ బస్సు ఢీకొట్టింది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ దుర్ఘటనలో 17 మంది మరణించారు. 24 మందికి గాయాలైనట్టు తెలిసింది. ఇందులో ఇద్దరి పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్టు సమాచారం. బస్సు చాలా వేగంగా ఢీకొట్టడంతో బస్సులోని అందరికీ తీవ్రగాయాలయ్యాయి. కాన్పూర్ నుంచి అహ్మదాబాద్ వెళ్తున్న ఏసీ బస్సు సచేందీ సమీపంలో జేసీబీని ఢీకొట్టింది. దీంతో జేసీబీ రోడ్డు పక్కకు జారగా, బస్సు పల్టీలు కొట్టింది.

యోగి సంతాపం…

ఈ దుర్ఘటనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మృతులకు సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలను సానుభూతి తెలిపారు. కాగా, మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూ. 2 లక్షలను ప్రకటించగా, క్షతగాత్రులకు రూ. 50వేల నష్టపరిహారాన్ని ఇస్తామని తెలిపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఘనటపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Tags:    

Similar News