ఘోర రోడ్డు ప్రమాదం.. అతివేగమే కారణమా ?

దిశ, దోమ: కారును తప్పించబోయి ఆటో బోల్తాపడిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని దొంగ ఎంకేపల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళ్లితే.. కులక్చర్ల మండలం ముజాహిద్ పూర్ గ్రామం నుండి లక్ష్మీదేవి పల్లి ఫ్యాక్టరీలో పని చేస్తున్న కూలీల ఆటో, డ్రైవర్ అతివేగం వలన ఎదురుగా వచ్చే కారును తప్పించబోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఏడుగురిలో ఒకరికి తీవ్ర గాయాలు అయినందువలన హైదరాబాద్‌కు […]

Update: 2021-11-22 01:56 GMT

దిశ, దోమ: కారును తప్పించబోయి ఆటో బోల్తాపడిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని దొంగ ఎంకేపల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళ్లితే.. కులక్చర్ల మండలం ముజాహిద్ పూర్ గ్రామం నుండి లక్ష్మీదేవి పల్లి ఫ్యాక్టరీలో పని చేస్తున్న కూలీల ఆటో, డ్రైవర్ అతివేగం వలన ఎదురుగా వచ్చే కారును తప్పించబోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఏడుగురిలో ఒకరికి తీవ్ర గాయాలు అయినందువలన హైదరాబాద్‌కు తరలించినట్లు, మిగతా ఆరుగురు పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి డ్రైవర్ అతి వేగమే కారణం అని భావించిన పోలీసులు ఆటో డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

epaper – 1:00 PM TS EDITION (22-11-21) చదవండి

 

Tags:    

Similar News