దారుణం : విధుల్లో ఉన్న హోంగార్డును ఢీ కొన్న లారీ

దిశ, నిర్మల్ : నిర్మల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. విధుల్లో ఉన్న హోంగార్డును లారీ ఢీ కొట్టి వెళ్లిన ఘటన జిల్లాలోని సోన్ మండలకేంద్రంలో ప్రధాన జాతీయ రహదారి 44 వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. నిర్మల్ జిల్లా ప్రవేశద్వారం గోదావరి వంతెనపై గల జిల్లా చెక్ పోస్టువద్ద 44వ ప్రధాన జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఏఎంవీఐ హరేంద్రకుమార్, మరో నలుగురు హోంగార్డులతో కలిసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో వారుగుర్తు […]

Update: 2021-11-16 03:49 GMT

దిశ, నిర్మల్ : నిర్మల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. విధుల్లో ఉన్న హోంగార్డును లారీ ఢీ కొట్టి వెళ్లిన ఘటన జిల్లాలోని సోన్ మండలకేంద్రంలో ప్రధాన జాతీయ రహదారి 44 వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. నిర్మల్ జిల్లా ప్రవేశద్వారం గోదావరి వంతెనపై గల జిల్లా చెక్ పోస్టువద్ద 44వ ప్రధాన జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఏఎంవీఐ హరేంద్రకుమార్, మరో నలుగురు హోంగార్డులతో కలిసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో వారుగుర్తు తెలియని లారీ వాహనంను ఆపే ప్రయత్నం చేస్తుండగా, ఓ లారీ అత్యంత వేగంతో దూసుకువచ్చి అక్కడే విధుల్లో ఉన్న ‘వై.సత్యనారాయణ’ అనే హోంగార్డును ఢీకొట్టి వెళ్ళిపోయింది. ఆ హోంగార్డు బలమైన గాయాలతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఎఎంవీఐ వెంటనే ఆ వాహనాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించినా వాహనం వివరాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. మిగతా రహాదారి చెక్ పోస్టులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం జిల్లాలోని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News