వారం రోజుల్లో బిడ్డ పెళ్లి.. బట్టల కోసం వెళ్లిన తండ్రి అంతలోనే..

దిశ, మర్రిగూడ: కూతురు పెళ్లి బట్టలకు వెళుతూ అనంత లోకాలకు ఓ తండ్రి వెళ్లిన సంఘటన మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన మామిడి శంకరయ్య (55 )కుమార్తె పెళ్ళి నిశ్చయం అయ్యింది. ఆదివారం బంధువులతో కలిసి కూతురు పెండ్లి బట్టలకు ఆటోలో మాల్‌కి వెళ్తున్నారు. ఎరగాండ్లపల్లి సమీపంలో ముందు వెళ్తున్న బైక్‌ను ఢీ కొట్టడంతో ఆటో పల్టీ కొట్టింది. దీంతో అందులో  ఉన్న మామిడి శంకరయ్య […]

Update: 2021-11-14 02:15 GMT

దిశ, మర్రిగూడ: కూతురు పెళ్లి బట్టలకు వెళుతూ అనంత లోకాలకు ఓ తండ్రి వెళ్లిన సంఘటన మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన మామిడి శంకరయ్య (55 )కుమార్తె పెళ్ళి నిశ్చయం అయ్యింది. ఆదివారం బంధువులతో కలిసి కూతురు పెండ్లి బట్టలకు ఆటోలో మాల్‌కి వెళ్తున్నారు. ఎరగాండ్లపల్లి సమీపంలో ముందు వెళ్తున్న బైక్‌ను ఢీ కొట్టడంతో ఆటో పల్టీ కొట్టింది. దీంతో అందులో ఉన్న మామిడి శంకరయ్య తల పగిలి అక్కడికక్కడే మరణించాడు. ఆటో‌లో ఉన్న ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. బైక్ పైన ఉన్న ఇద్దరికీ గాయాలు కావడంతో వారిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య కుమార్తె కుమారుడు ఉన్నారు. మూడు రోజుల క్రితం మాల్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడిన విషయం మరువకముందే మరొకరు మృత్యువాత పడటంతో వట్టిపల్లి గ్రామం‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News