ఇస్నాపూర్ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం..!
దిశ, పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది. యూటర్న్ తీసుకుంటున్న బైకును ఎదురుగా వచ్చిన కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం సుందిళ్ల గ్రామానికి చెందిన చాకలి మద్దిలేటిగా గుర్తించారు. మద్దిలేటి ఎనిమిదేళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం పట్టణానికి వచ్చి పాశమైలారం పారిశ్రామికవాడలోని అరబిందో ఫార్మా యూనిట్ 5 లో […]
దిశ, పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది. యూటర్న్ తీసుకుంటున్న బైకును ఎదురుగా వచ్చిన కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం సుందిళ్ల గ్రామానికి చెందిన చాకలి మద్దిలేటిగా గుర్తించారు. మద్దిలేటి ఎనిమిదేళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం పట్టణానికి వచ్చి పాశమైలారం పారిశ్రామికవాడలోని అరబిందో ఫార్మా యూనిట్ 5 లో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం విధులు ముగించుకుని బైక్ పై వెళ్తుండగా ఇస్నాపూర్ చౌరస్తాలో యూటర్న్ తీసుకుంటుండగా, పటాన్‌చెరు నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న కంటైనర్ ఢీ కొట్టింది. కంటైనర్ వెనక టైర్లు మద్దిలేటి నడుముపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య లక్ష్మీ పిర్యాదు మేరకు ఎస్ఐ సాయిలు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.