ఐపీఎల్‌లో వివాదాస్పదం.. తెరపైకి 'రౌండ్ ఆర్మ్' ప్రయోగం

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్‌ అంటే క్రికెట్‌ను మించిన మరో వినోదం. ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రికెటర్లు అందరూ ఈ లీగ్‌లో ఆడుతుండటంతో క్రికెట్ ప్రేమికులు ఒక్క మ్యాచ్ కూడా వదలకుండా చూస్తుంటారు. ఈ ఐపీఎల్ ఒకపైపు వినోదాన్ని పంచుతూనే.. మరోవైపు వివాదాలకు కూడా కేంద్రంగా మారింది. మైదానం వెలుపల జరిగే బెట్టింగ్, ఫిక్సింగ్ అన్నీ పక్కన పెడితే.. ఆట జరిగే సమయంలో మైదానంలో జరిగే వివాదాలు కూడా చర్చనీయాంశంగా మారుతుంటాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఎలాంటి […]

Update: 2021-04-13 08:20 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్‌ అంటే క్రికెట్‌ను మించిన మరో వినోదం. ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రికెటర్లు అందరూ ఈ లీగ్‌లో ఆడుతుండటంతో క్రికెట్ ప్రేమికులు ఒక్క మ్యాచ్ కూడా వదలకుండా చూస్తుంటారు. ఈ ఐపీఎల్ ఒకపైపు వినోదాన్ని పంచుతూనే.. మరోవైపు వివాదాలకు కూడా కేంద్రంగా మారింది. మైదానం వెలుపల జరిగే బెట్టింగ్, ఫిక్సింగ్ అన్నీ పక్కన పెడితే.. ఆట జరిగే సమయంలో మైదానంలో జరిగే వివాదాలు కూడా చర్చనీయాంశంగా మారుతుంటాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఎలాంటి వివాదం లేదని అనుకుంటుండగానే.. ఒక బౌలర్ యాక్షన్‌పై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఒక యువ బౌలర్ వేసిన బంతి వివాదాస్పదంగా మారడంతో బౌలింగ్ యాక్షన్‌పై చర్చ మొదలైంది. టీ20 ఫార్మాట్‌లో బ్యాట్స్‌మెన్ అనేక వైవిధ్యమైన షాట్లు ఆడుతూ పరుగులు రాబడుతుంటారు. ఏబీ డివిలియర్స్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, క్రిస్ గేల్, సూర్యకుమార్ వంటి బ్యాట్స్‌మెన్ క్రికెట్ బుక్‌లో లేని షాట్లు కూడా ప్రయత్నిస్తుంటారు. అదే సమయంలో ఇలాంటి దూకుడైన బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడానికి బౌలర్లు వేసే బంతులు వివాదాస్పదం అవుతున్నాయి.

రియాన్ పరాగ్ బంతితో..

క్రికెట్ అంటేనే బ్యాట్స్‌మెన్ గేమ్. అందులో టీ20 ఫార్మాట్‌లో వారిదే పూర్తి ఆధిపత్యం. ఇక ఐపీఎల్‌లో బ్యాట్స్‌మెన్ దూకుడుకు అడ్డుకట్ట వేయడం చాలా కష్టం. సోమవారం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసే సమయంలో క్రిస్ గేల్‌ను అవుట్ చేయడానికి రియాన్ పరాగ్ ‘రౌండ్ ఆర్మ్’ బంతిని ప్రయోగించాడు. (ఒక బౌలర్ తన చేతిని 90 డిగ్రీల కోణంలో వంచి బౌలింగ్ చేయడాన్ని రౌండ్ ఆర్మ్ బౌలింగ్‌గా పరిగణిస్తారు) ఒకవేళ బంతిని 90 డిగ్రీల కంటే ఎక్కువ వంచితే అది అండర్ ఆర్మ్ బౌలింగ్ అవుతుంది. రియన్ పరాగ్ కూడా ఇలాగే రౌండ్ ఆర్మ్ బౌలింగ్ వేయడంతో అంపైర్ అతడికి హెచ్చరిక జారీ చేశాడు. మరోసారి ఇలా బౌలింగ్ చేస్తే రిఫరీకి ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని చెప్పాడు. దీంతో రియాన్ పరాగ్ బౌలింగ్ యాక్షన్ మార్చి తన సహజ శైలిలో బౌలింగ్ చేశాడు. అయితే అదే ఓవర్‌లో క్రిస్ గేల్ భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. అయితే రౌండ్ ఆర్మ్ బౌలింగ్ వల్లే క్రిస్ గేల్ డిస్ట్రబ్ అయ్యి అవుటయ్యాడని పలువురు ఆరోపిస్తున్నారు.

గతంలో ఇలా..

ఐపీఎల్‌తో సహా అంతర్జాతీయ క్రికెట్‌లో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, కేదార్ జాదవ్ ఇలాంటి బౌలింగ్ వేశారు. రవిచంద్రన్ అశ్విన్ రెగ్యులర్‌గా కాకపోయినా అప్పడప్పుడు ఇలా రౌండ్ ఆర్మ్ బౌలింగ్ వేసేవాడు. దీంతో అతడిపై మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు గుప్పించడంతో రౌండ్ ఆర్మ్ బౌలింగ్ మానేశాడు. అయితే కేదార్ జాదవ్ యాక్షన్ మాత్రం ఇప్పటికీ ఇలాగే కొనసాగుతున్నది. 19వ శతాబ్దం తొలినాళ్లలో బౌలర్లు ఈ బౌలింగ్ యాక్షన్‌తో బంతులు విసరడం ప్రారంభించారు. ‘అండర్ ఆర్మ్’ బౌలింగ్‌పై వివాదం చెలరేగడంతో బ్యాట్స్‌మెన్‌ను కన్‌ఫ్యూజ్ చేయడానికి ఈ రౌండ్ ఆర్మ్‌ను ఎంచుకున్నారు.

అయితే ఓవర్ ఆర్మ్ బౌలింగ్‌ను అధికారికంగా గుర్తించిన తర్వాత బౌలర్లు ఈ రౌండ్ ఆర్మ్ బౌలింగ్‌ను వేయడం వదిలేశారు. అయితే క్రికెట్ బుక్‌లో మాత్రం బౌలర్ 90 డిగ్రీల కంటే ఎక్కువగా వంచి బౌలింగ్ చేయకూడదనే నిబంధన విధించారు. దీంతో బౌలర్లు పూర్తి రౌండ్ ఆర్మ్ కాకుండా తమకు అనుకూలమైన బౌలింగ్ వేయడం మొదలుపెట్టారు. లసిత్ మలింగ వేసే బౌలింగ్ యాక్షన్ కూడా చాలా మందికి మొదట్లో అనుమానస్పదంగా అనిపించింది. కానీ అది రూల్ ప్రకారమే ఉన్నట్లు ఐసీసీ నిర్దారించింది. ఇక తాజాగా రియాన్ పరాగ్ బౌలింగ్ యాక్షన్‌తో మరోసారి రౌండ్ ఆర్మ్ బౌలింగ్‌పై చర్చ మొదలైంది.

దీనిపై క్రికెట్ రూల్స్ తయారు చేసే మెరిల్‌బోర్న్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) దీనిపై వివరణ ఇచ్చింది. రియాన్ పరాగ్ బౌలింగ్ దాదాపు అండర్ ఆర్మ్ బౌలింగ్‌కు దగ్గరగా వచ్చింది. కానీ అంతకంటే చేతిని వంచితే కచ్చితంగా అండర్ ఆర్మ్ బౌలింగ్‌ కిందకే వస్తుందని ఎంసీసీ చెప్పింది.

Tags:    

Similar News