‘రితేష్.. ఎమోషన్ ‘భాగి’
రితేష్ దేశ్‌ముఖ్..బాలీవుడ్ టాలెంటెడ్ హీరో. కెరీర్ ఆరంభం నుంచి ఎక్కువగా మల్టీ స్టారర్ చిత్రాలకే ప్రాధాన్యతనిచ్చినా..సినిమాలో తన క్యారెక్టర్ స్ట్రాంగ్‌గా ఉంటేనే ఓకే చెప్తాడనే పేరుంది. ఎక్కువగా కామెడీ ఫిల్మ్స్‌కే ఇంపార్టెన్స్ ఇచ్చే హీరో..ఇప్పుడు ‘భాగి -3’ సినిమాలో ఎమోషనల్ రోల్ ట్రై చేశాడు. టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో రితేష్ తనకు అన్నగా నటించాడు. కానీ ట్రయలర్ చూస్తే టైగర్ ష్రాఫ్‌కే సినిమాలో ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్టు కనిపిస్తుండగా..రితేష్ చేయాల్సిన అవసరముందా? అని […]
రితేష్ దేశ్‌ముఖ్..బాలీవుడ్ టాలెంటెడ్ హీరో. కెరీర్ ఆరంభం నుంచి ఎక్కువగా మల్టీ స్టారర్ చిత్రాలకే ప్రాధాన్యతనిచ్చినా..సినిమాలో తన క్యారెక్టర్ స్ట్రాంగ్‌గా ఉంటేనే ఓకే చెప్తాడనే పేరుంది. ఎక్కువగా కామెడీ ఫిల్మ్స్‌కే ఇంపార్టెన్స్ ఇచ్చే హీరో..ఇప్పుడు ‘భాగి -3’ సినిమాలో ఎమోషనల్ రోల్ ట్రై చేశాడు. టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో రితేష్ తనకు అన్నగా నటించాడు. కానీ ట్రయలర్ చూస్తే టైగర్ ష్రాఫ్‌కే సినిమాలో ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్టు కనిపిస్తుండగా..రితేష్ చేయాల్సిన అవసరముందా? అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. దానికి సమాధానంగా రితేష్… ప్రోమోస్, ట్రైలర్స్‌లో తన క్యారెక్టర్ గురించి తెలియకపోయినా..సినిమా రిలీజయ్యాక మాత్రం మీరు ఖచ్చింతగా మంచి పాత్ర చేశారని ప్రశంసిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ‘భాగి’, ‘భాగి -2’ సినిమాలు ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీస్ కాగా..’భాగి -3’ని యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తీర్చిదిద్దారని తెలిపారు. యాక్షన్‌తో పాటు ఎమోషన్ ఉంటేనే ప్రేక్షకులపై ఎక్కువ ప్రభావం ఉంటుందని, ఆ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుందని అభిప్రాయపడ్డారు రితేష్.
అంతేకాదు ‘సైరట్’ డైరెక్టర్ నాగరాజ్ మంజులె దర్శకత్వంలో రాబోతున్న ఛత్రపతి శివాజీ మహారాజ బయోపిక్ 2020 చివర్లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. ఈ సినిమాలో ఛత్రపతి శివాజీగా రితేష్ కనిపించనుండగా..అజయ్-అతుల్ సంగీతం అందించనున్నారు.