ఎనిమిదిసార్లు జెనీలియా కాళ్లు మొక్కిన రితేష్.. ఎందుకు?

దిశ, సినిమా: ‘బొమ్మరిల్లు’ చిత్రంతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న జెనీలియా.. నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకున్నాక సినిమాలకు దూరంగా ఉంటోంది. అయితే ఈ మధ్య ‘సూపర్ డ్యాన్సర్ 4’ రియాలిటీ షోకు భర్త రితేష్‌తో కలిసి హాజరైంది. వీరు శిల్పాశెట్టి స్థానంలో ఈ కార్యక్రమానికి హాజరైనట్టు తెలుస్తుండగా, వెడ్డింగ్ థీమ్‌పై టెలికాస్ట్ కానున్న అప్‌కమింగ్ ఎపిసోడ్‌‌లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఈ మేరకు ఒక కంటెస్ట్ పర్ఫార్మెన్స్‌కు ఫిదా అయిపోయిన జెనీలియా.. తన పెళ్లి సీన్ […]

Update: 2021-07-31 07:03 GMT

దిశ, సినిమా: ‘బొమ్మరిల్లు’ చిత్రంతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న జెనీలియా.. నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకున్నాక సినిమాలకు దూరంగా ఉంటోంది. అయితే ఈ మధ్య ‘సూపర్ డ్యాన్సర్ 4’ రియాలిటీ షోకు భర్త రితేష్‌తో కలిసి హాజరైంది. వీరు శిల్పాశెట్టి స్థానంలో ఈ కార్యక్రమానికి హాజరైనట్టు తెలుస్తుండగా, వెడ్డింగ్ థీమ్‌పై టెలికాస్ట్ కానున్న అప్‌కమింగ్ ఎపిసోడ్‌‌లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఈ మేరకు ఒక కంటెస్ట్ పర్ఫార్మెన్స్‌కు ఫిదా అయిపోయిన జెనీలియా.. తన పెళ్లి సీన్ గుర్తొచ్చిందని తెలిపింది. వివాహ వేడుకలో భాగంగా రితేష్, తన కాళ్లకు ఎనిమిదిసార్లు నమస్కరించాల్సి వచ్చిందని వెల్లడించింది. సంప్రదాయాల ప్రకారమే అలా చేశాడని చెప్పింది. అయితే జెనీలియా మాటలకు స్పందించిన రితేష్.. పెళ్లి తర్వాత ఏం చేయాలో పూజారికి తెలుసనుకుంటా. అందుకే ముందుగానే ఆచరించేలా చేశాడు’ అని చమత్కరించాడు.

Tags:    

Similar News