ఆత్మహత్యలకు ‘మిడ్‌మానేరు’ నిలయం.. చర్యలేవి..!

దిశ,వేములవాడ: మిడ్‌మానేరు ప్రమాదాలకు, ఆత్మహత్యలు చేసుకోవడానికి నిలయంగా మారింది. రక్షణ చర్యలు చేపట్టాల్సిన ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. దీంతో మిడ్ మానేరు చానువు చాలించేందుకు అడ్డగా మారింది. కరీంనగర్–సిరిసిల్ల ప్రధాన రహదారి బోయినపల్లి మండలం కొదరుపాక నుంచి ఆరెపల్లి వరకు ఫోర్‌లైన్ బ్రిడ్జిని నిర్మించారు. మిడ్‌మానేరు నిర్మాణంలో భాగంగా రూ.130 కోట్లతో ఇరిగేషన్‌శాఖ, ఆర్అండ్‌బీలు కలిసి మూడు కిలోమీటర్ల మేర బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. కానీ దీనికి ఇరువైపులా రక్షణ చర్యలు చేపట్టాల్సిన అధికారులు ఆ దిశగా […]

Update: 2021-03-17 13:07 GMT

దిశ,వేములవాడ: మిడ్‌మానేరు ప్రమాదాలకు, ఆత్మహత్యలు చేసుకోవడానికి నిలయంగా మారింది. రక్షణ చర్యలు చేపట్టాల్సిన ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. దీంతో మిడ్ మానేరు చానువు చాలించేందుకు అడ్డగా మారింది. కరీంనగర్–సిరిసిల్ల ప్రధాన రహదారి బోయినపల్లి మండలం కొదరుపాక నుంచి ఆరెపల్లి వరకు ఫోర్‌లైన్ బ్రిడ్జిని నిర్మించారు. మిడ్‌మానేరు నిర్మాణంలో భాగంగా రూ.130 కోట్లతో ఇరిగేషన్‌శాఖ, ఆర్అండ్‌బీలు కలిసి మూడు కిలోమీటర్ల మేర బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు.

కానీ దీనికి ఇరువైపులా రక్షణ చర్యలు చేపట్టాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. దీంతో ఆత్మహత్యలు చేసుకునే వారికి అడ్డగా మారింది. మూడు రోజుల క్రితం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఖాజీపూర్‌కు చెందిన ఇల్లందుల సాయికృష్ణ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటువంటి ఘటనలు మరెన్నో జరుగుతున్నా ఆఫీసర్లు మాత్రం పట్టించుకోవడం లేదు.

రెండేళ్లలో 13 మంది ఆత్మహత్య

కొదురుపాక మిడ్‌మానేరు బ్రిడ్జి నుంచి రెండేళ్లలో 13 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కొంత మంది ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా, పోలీసులు, ప్రజలు, జాలర్లు కాపాడిన ఘటనలూ ఉన్నాయి. గత నెల 6, 7 తేదీల్లో రాత్రి జరిగిన వరుస రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు చనిపోయారు. సోమవారం ఇద్దరు మానేరులో పడి మృతి చెందారు. గత నెల 6న వేములవాడ మండలం చెక్కపల్లి గ్రామానికి చెందిన లక్ష్మన్ కబడ్డీ కోచ్ కరీంనగర్ నుంచి తన స్వగ్రానికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా, మిడ్‌మానేరు వచ్చే సరికి పూర్తిగా చీకటిగా ఉండడంతో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తలకు తీవ్రగాయాలై అక్కడిక్కడే చనిపోయాడు. 7న బ్రిడ్జిపై రాత్రి పూట ఎదురుగా లారీ, వ్యాన్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదంలో ఇద్దరు వలస కూలీలు మరణించారు.

గతేడాది వరంగల్ జిల్లా గీసుకొండ మండల ధర్మారం గ్రామానికి చెందిన సుకృత వేములవాడకు స్కూటి పై వచ్చి ప్రేమికుడిని కలిసింది. ప్రేమ విషయంలో మోసపోయానని తెలిసుకుని తిరుగు ప్రయాణంలో బ్రిడ్జి వద్దకు రాగానే మిడ్ మానేరు దూకి ఆత్మహత్య చేసుకుంది. బ్రిడ్జి మీదకు రాగానే చిమ్మటి చీకట్లు ఉండడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, లైటింగ్ ఏర్పాటు చేయాలనీ పలుమార్లు ఆఫీసర్లుకు విన్నవించుకున్న పట్టించుకోవడం లేదనీ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ప్రతిపాదనలు సరే.. పనులేవి

బ్రిడ్జిపై వరుస ప్రమాదాలు, ఆత్మహత్యలు జరుగుతున్న నేపథ్యంలో రక్షణ చర్యలు చేపట్టాలని ప్రతి పాదనలు పంపినా ఫలితం లేకుండా పోయింది. బ్రిడ్జి రక్షణగోడలకు జాలీలతో ఫెన్సింగ్, బ్రిడ్జి పరిసరాల్లో లైటింగ్, జీరో పాయింట్ వద్ద ఔపోస్ట్, సీసీ కెమెరాలు, బ్రిడ్జికి ఇరువైపులా ప్రమాద సూచికలు,హెచ్చరిక బోర్డులు, స్టిక్కర్లు ఏర్పాటు చేయాలనీ ప్రతిపాదనలు చేశారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో, ఆఫీసర్ల నిర్లక్షానికి నిదర్శనంగా నిలుస్తుందనీ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రక్షణ చర్యలు చేపట్టాలనీ మండల ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News